కృతిశెట్టి అమాయకురాలు కాదు.. గట్టిగా హిట్ కొడుతున్నాం అంటూ మాచర్ల నియోజవర్గం ప్రీ రిలీజ్ నితిన్ ఎమోషనల్
యువ హీరో నితిన్, యువ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్టు 12 రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో 20 ఏళ్ల ప్రయాణం నాది. గత 20 ఏళ్ల నా అభిమానులు, ఫ్రెండ్స్, సన్నిహితులు, స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ ఎన్నడూ మరిచిపోలేను. మాచర్ల నియోజకవర్గం నా హృదయానికి దగ్గరైన సినిమా. రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సముద్రఖనికి గారికి చాలా థ్యాంక్స్ అని ఎమోషనల్ అయ్యారు. ఈ వేడుకలో నితిన్ ఇంకా మాట్లాడుతూ..

సముద్రఖని దర్శకత్వంలో
మాచర్ల నియోజకవర్గం సినిమాకు సముద్రఖని పాత్ర చాలా కీలకం. ఆయన చాలా సహాయం చేశారు. ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు డేట్స్ ఇచ్చారు. మళ్లీ మళ్లీ సముద్రఖనితో పనిచేయాలని కోరుకొంటున్నాను. ఆయన దర్శకత్వలో కూడా నేను నటించాలని ఆశపడుతున్నాను అని నితిన్ ఎమోషనల్ అయ్యారు.

వెన్నెల కిషోర్ సినిమాకు వెన్నెముక
వెన్నెల కిషోర్ బిజీగా ఉండటం కారణంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోయారు. ఈ సినిమాకు వెన్నుముక. ఫస్టాఫ్‌లో సీన్లు చాలా బాగుంటాయి. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా వర్క్ చేశారు. మధు మా ఆస్థాన ఆర్ట్ డైరెక్టర్‌గా మారిపోయారు. డైలాగ్ రైటర్ తిరు అద్భుతమైన సంభాషణలు రాశారు. కాసర్ల శ్యామ్, కేకే నా కెరీర్‌లో మంచి పాటలు రాశారు. ఇక ముందు కూడా అలాగే నాకు మంచి పాటలు రాయాలి. జిత్తు మాస్టర్ పోరి సాంగ్‌కు అద్బుతంగా స్టెప్పులు వేయించారు. ఆయన గొప్ప డ్యాన్స్ డైరెక్టర్ అవుతారు. డీవోపీ ప్రసాద్ మూరేళ్ల సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దారు అని నితిన్ చెప్పారు.

మహతి సాగర్ అద్బుతంగా మ్యూజిక్
మాచర్ల నియోజకవర్గం సినిమాకు సంగీత దర్శకుడు మహతి సాగర్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఇప్పటికే పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బీజీఎంకు మణిశర్మ టాప్ అని చెప్పుకొంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడు అని సాగర్ అనిపించుకొంటారు. కొన్ని సీన్లలో గూస్ బంప్స్.. గూస్ పింపుల్స్ వస్తాయి. ఆ రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చారు. ప్రతీ పాటకు మూడు సీన్లు ఇచ్చారు. మా కాంబినేషన్ చాలా సినిమాలు హిట్ అయ్యాయి అని నితిన్ చెప్పారు.

కృతిశెట్టి చాలా షార్ప్
మాచర్ల నియోజకవర్గంలో హీరోయిన్‌గా నటించిన కృతిశెట్టి సూపర్. బేబమ్మను చూస్తే చాలా అమాయకురాలిగా కనిపిస్తుంది. కానీ చాలా షార్ప్. షూటింగ్‌లో ఆమె అడిగే డౌట్లు, లాజిక్స్ చాలా గొప్పగా ఉంటాయి. టాలీవుడ్‌లో ఆమె కెరీర్ చాలా సుదీర్ఘంగా సాగాలని కోరుకొంటాను. 20 ఏళ్ల పాటు నీవు కూడా కుమ్మేయాలి అని నితిన్ అన్నారు.
Recommended Video


రాజశేఖర్ గట్టిగా హిట్ కొట్టబోతున్నాడు..
మాచర్ల నియోజకవర్గం సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. శేఖర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాను కొత్త దర్శకుడిలా తీయలేదు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్ చేశాడు. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టబోతున్నామనే స్ట్రాంగ్ ఫీలింగ్‌తో ఉన్నాం. ఈ సినిమాకు మా నాన్న, అక్క నిర్మాతలు. వారి గురించి మాట్లాడటం సరి కాదు. మా కో ప్రొడ్యూసర్ హరి గురించి ఎంత చెప్పినా తక్కువే అని నితిన్ అన్నారు.


Click it and Unblock the Notifications











