Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
యాడ్ కోసం అదిరిపోయే లుక్.. నితిన్ పిక్స్ వైరల్
టాలీవుడ్ హీరో నితిన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూసిన నితిన్‌కు భీష్మ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో గడపడం ఇలా నితిన్‌కు ఈ ఏడాది అంతా బాగానే కలిసి వచ్చింది. ఇలా లాక్ డౌన్ ఎత్తేశారో లేదో మళ్లీ షూటింగ్‌లంటూ రంగంలోకి దిగేశాడు.
మామూలుగా అయితే కరోనా అనేది రాకుండా ఉండి ఉంటే.. ఈ పాటికి నితిన్ మరో రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేవాడు. రంగ్ దే, అంధాదున్ రీమేక్‌లు ఈ పాటికి మన ముందుకు వచ్చేవి. కానీ లాక్డౌన్ వల్ల అన్నీ తారుమారు అయ్యాయి. అందుకే ఇప్పుడు వాటన్నంటినిక చకచకా పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ మధ్యే చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్ట్ 'చెక్'కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాడు.
అయితే నితిన్ తన కెరీర్లో మొదటి సారిగా ఓ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నాడు. ఎండోర్స్మెంట్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు హీరోలు పలు ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనల్లో నటిస్తారు. ఈ మధ్యే రామ్ కూడా ఓ యాడ్‌లో నటించేశాడు. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. ఈ యాడ్ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్‌ను నితిన్ తాజాగా షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అందులో నితిన్ కూల్‌గా కనిపించడంతో అందరూ ఫిదా అవుతున్నారు.