twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాడ్ కోసం అదిరిపోయే లుక్.. నితిన్ పిక్స్ వైరల్

    |

    టాలీవుడ్ హీరో నితిన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూసిన నితిన్‌కు భీష్మ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో గడపడం ఇలా నితిన్‌కు ఈ ఏడాది అంతా బాగానే కలిసి వచ్చింది. ఇలా లాక్ డౌన్ ఎత్తేశారో లేదో మళ్లీ షూటింగ్‌లంటూ రంగంలోకి దిగేశాడు.

    మామూలుగా అయితే కరోనా అనేది రాకుండా ఉండి ఉంటే.. ఈ పాటికి నితిన్ మరో రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేవాడు. రంగ్ దే, అంధాదున్ రీమేక్‌లు ఈ పాటికి మన ముందుకు వచ్చేవి. కానీ లాక్డౌన్ వల్ల అన్నీ తారుమారు అయ్యాయి. అందుకే ఇప్పుడు వాటన్నంటినిక చకచకా పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ మధ్యే చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్ట్ 'చెక్'కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాడు.

     nithiin Stunning Look For Ad Shoot

    అయితే నితిన్ తన కెరీర్‌లో మొదటి సారిగా ఓ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నాడు. ఎండోర్స్‌మెంట్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు హీరోలు పలు ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనల్లో నటిస్తారు. ఈ మధ్యే రామ్ కూడా ఓ యాడ్‌లో నటించేశాడు. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. ఈ యాడ్ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్‌ను నితిన్ తాజాగా షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అందులో నితిన్ కూల్‌గా కనిపించడంతో అందరూ ఫిదా అవుతున్నారు.

     nithiin Stunning Look For Ad Shoot

    English summary
    nithiin Stunning Look For Ad Shoot, This is his first major corporate brand. Excited Nithin has shared photos from the sets. 2020 has been every eventful year for Nithin. He tasted success early this year and also married his girlfriend Shalini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X