బిగ్ సర్‌ప్రైజ్: మెగా హీరో సినిమాలో నితిన్.. అక్కడ కూడా అదే పాత్ర
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.

సూపర్ హిట్ సినిమాకు రీమేక్
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుకుమార్ కీలక పాత్ర
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొద్ది నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం హరీశ్ శంకర్ ఆయనను సంప్రదించారట. దీనికి ఆయన వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. దీనికితోడు ట్విట్టర్‌లో వీళ్లు సమావేశం అయిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

నితిన్ కూడా చేస్తున్నాడట
తాజాగా ‘వాల్మీకి' గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ కూడా నటిస్తున్నాడట. సుకుమార్ లానే ఈయన కూడా కొద్దిసేపు కనిపిస్తాడని ఓ వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నితిన్‌పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని టాక్. ఇందులో నితిన్ హీరోగా కనిపిస్తాడట.

రెండు సినిమాలతో బిజీ
ప్రస్తుతం నితిన్ భీష్మ, రంగ్ దే చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అతడు ‘వాల్మీకి' కోసం డేట్స్ కేటాయించాడు. ఈ రెండు సినిమాలతో పాటు ‘అంధాధున్' తెలుగు రీమేక్‌లో కూడా అతడు నటిస్తాడని ఇటీవల వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











