‘రాబిన్ హుడ్’ కాంట్రవర్సీ.. నితిన్ తప్పించుకునే ప్రయత్నం
టాలీవుడ్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రాబిన్ హుడ్. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. యంగ్ సెన్సేషన్, స్టార్ హీరోయిన్ శ్రీలీలా ఫీమేల్ లీడ్ లో నటించింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ స్కేల్లో నిర్మించారు. 60 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఖర్చుచేశారు. ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇక మరో మూడో రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ మూవీ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచింది. ఈ సందర్భంగా నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
సినిమాపై మరింత హైప్ పెంచేందుకు యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. పలు ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, రాపిడ్ ఫైర్ లాంటి కార్యక్రమాలతో సినిమాపై మరింతగా రీచ్ పెంచుతున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో సినిమాను చూసే విధంగా అప్డేట్స్ ఆకర్షిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓ కాంట్రవర్సీ కూడా ఉంది.

ఈ చిత్రంలో మాస్ ఆడియెన్స్ కోసమని మేకర్స్ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతికా శర్మ తో ఊరమాస్ స్టెప్పులు, కుర్ర గుండెలు జారిపోయే స్టెప్పులను వేయించారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే కేతికతో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులు ఇప్పుడు పలు విమర్శలకు దారి తీసింది. కేతికా శర్మ లెహంగాతో సిగ్నేచర్ స్టెప్ వేయించారు. అది కాస్తా వివాదానికి దారి తీసింది. ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా తెలంగాణ స్టేట్ విమెన్ కమిషన్ నోట్ విడుదల చేసింది.
హీరోయిన్లతో అసభ్యంగా డ్యాన్స్ లు చేయిస్తే ఊరుకోబోమని, అందుకు ఫిల్మ్ మేకర్సే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియా నుంచి కేతిక శర్మతో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులపై కొంత నెగెటివ్ రెస్పాన్సే దక్కింది. సాంగ్ బాగున్నా కొరియోగ్రఫీ మాత్రం మరీ చూడలేకుండా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా నితిన్ కు ప్రశ్న ఎదురైంది. అందుకు నితిన్ ఆసక్తికరంగా బదులిచ్చాడు.
తను ఆ సాంగ్ షూటింగ్ లో లేనని చెప్పారు. అసలు అలాంటి స్టెప్స్ ఉన్నాయనేది తనకు తెలియదని చెప్పారు. ఆ పాట వివాదాని గురైందనే విషయం కూడా తెలియలేదన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నదని తెలిపారు. కొద్ది మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే.. మరికొద్ది మంది నుంచి నెగెటివ్ రెస్పాన్స్ సొంతం అవుతుందన్నారు. దాంతో సినిమా సాంగ్ పరిస్థితి ఏంటనేది తనకే అర్థం కాలేదన్నారు. మున్ముందు సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలని అంటున్నారు. అయితే తన సినిమాలోని పాటపై వస్తున్న అభ్యంతరాలు తనకు తెలియకపోవడం ఏంటని, అతను ఆ వివాదానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాడేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











