వాళ్లకు అన్ని కోట్లు ఇవ్వడం కన్నా.. టబుకి ఒక కోటి ఇస్తే చాలట..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కంటే ఓ వర్గం నటీమణులకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. నదియా, రమ్య కృష్ణ, టబు లాంటి సీనియర్ హీరోయిన్స్ ఒక విధంగా ఓ వర్గం హీరోయిన్స్ కంటే ఎక్కువనే సంపాదిస్తున్నారు. దాదాపు కోటికి పైగా రెమ్యునరేషన్స్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక నిర్మాత తన సినిమా కోసం మొదట స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించి చివరికి టబుపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ నిర్మాత మరెవరో కాదు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. ఈ నిర్మాత కొడుకుతో అందాదున్ సినిమాను నిర్మించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. సినిమా స్క్రిప్ట్ కూడా మళ్లీ కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది గాని అందాదున్ ఒరిజినల్ కథలో టబు చేసిన పాత్ర కోసం గత కొంత కాలంగా చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదించారు.

ఆల్ మోస్ట్ నయనతార ఒకే అయ్యిందని అనుకోగా ఆమె ఏకంగా 9కోట్లు అడగడంతో నిర్మాత వెనక్కి తగ్గారట. ఆ తరువాత రమ్యకృష్ణ, ప్రియమణి, ఇలియానా వంటి వారిని కూడా అనుకున్నారట. కానీ ఆ బోల్డ్ పాత్రకు వారు అంతగా సెట్టవ్వరని మళ్ళీ మనసు మార్చుకొని మొదటి నిర్ణయానికె వచ్చారట. వేరేవాళ్లకు కోట్లు ఇవ్వడం కన్నా కూల్ గా కోటి ఇచ్చేసి టబును సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











