మెగా హీరో ప్లాన్ ఫాలో అవుతున్న నితిన్.. ఆ గండం గట్టెక్కితే చాలట
టాలీవుడ్ ఇండస్ట్రీకి కరోనా దెబ్బ ఇప్పట్లో తగ్గేలా లేదు. థియేటర్స్ చరిత్రలోనే మొదటిసారి నెలల తరబడి క్లోజ్ అయ్యాయి. మరికొన్ని ఐకానిక్ థియేటర్స్ కూడా త్వరలోనే షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ లా మారబోతున్నాయి. ఇక డిసెంబర్ లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఇక ముందు జాగ్రత్తగా చాలా వరకు కొందరు ఓటీటీ రైట్స్ ద్వారా సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా జీ5 కి మంచి రేటుకే అమ్మేసుకోగా వాళ్ళు థియేట్రికల్ రెడీ చేయడానికి కూడా రెడీ అయ్యారు.
ఇక మరోవైపు నితిన్ కూడా అదే తరహాలో ప్లాన్ వేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ అయితే నడుస్తోంది. నితిన్ ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి సక్సెస్ అయితే కొట్టాడు. ఇక రంగ్ దేపై కూడా అలాంటి నమ్మకమే పెట్టుకున్నాడు. ఇక దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంధి. అయితే సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడం అనుమానమేనని తెలుస్తోంది. అందుకు కారణం సినిమా అత్యధిక బడ్జెట్. రొమాంటిక్ లవ్ డ్రామాను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ గట్టి నమ్మకమే పెట్టుకుంది.

కానీ జనాలు గతంలో మాదిరిగా థియేటర్స్ కు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు వచ్చినట్లుగా ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఓటీటీ సంస్థతో డీలింగ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. థియేటర్స్ లో రిలీజ్ చేయించాలని కూడా అనుకుంటున్నారట. అందుకు ఓటీటీ సంస్థల నుంచి నాలుగైదు కోట్ల లాభం వచ్చినా కూడా అమ్మేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి రంగ్ దే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











