Check Telugu Movie First Glimpse: జైల్లో చెస్ ఆడుతున్న నితిన్.. ఆనంద్‌ను మించేలా!

'జయం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు నితిన్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు యాక్టర్‌గానూ మెప్పించాడు. ఆ వెంటనే 'దిల్' అనే మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాత చాలా రోజుల పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఈ నేపథ్యంలో 'ఇష్క్' తర్వాత అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తర్వాత అతడి కెరీర్ సాఫీగానే సాగుతోంది. దీంతో వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.

ఈ ఏడాది 'భీష్మ'తో హిట్‌ను అందుకున్న నితిన్.. ప్రస్తుతం 'రంగ్‌దే' అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటే వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తోన్న 'చెక్'లోనూ నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అతడు చెస్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైంది. జైల్లో ఉన్న హీరో.. గొప్ప చెస్ ప్లేయర్ అని చెబుతూ ఈ వీడియో మొదలవుతుంది. ఆ తర్వాత అతడికి ఉగ్రవాది అన్న పేరు రావడంతో ఉరి శిక్ష పడుతుంది. మొత్తానికి ఈ వీడియో ఆసక్తికరంగా సాగుతుంది.

Nithiins Check Telugu Movie First Glimpse Released

నితిన్ 28వ సినిమాగా వస్తున్న 'చెక్'లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాలో భాగంగా హీరో ఓ కేసులో ఇరుక్కుంటాడట. దీంతో న్యాయస్థానం అతడికి ఉరిశిక్షను విధిస్తుందని తెలుస్తోంది. ఉరిశిక్ష పడిన ఖైదీ అయిన నితిన్ దేశం కోసం చెస్ ఆడేందుకు అనుమతి తీసుకుంటాడట. ఆ టోర్నీలో ఇండియాకు పతకం తీసుకు రావడంతో ప్రజా కోరిక మేరకు న్యాయస్థానం ఉరిశిక్షను రద్దు చేస్తుందట. ఇదే ఈ సినిమా కథ అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X