‘చెక్’ డిజిటల్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న నితిన్ సినిమా
గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ ఏడాది మాత్రం అతడి కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. ఈ సంవత్సరం ఆరంభంలోనే అతడు 'చెక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన చంద్ర శేఖర్ ఏలేటి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఊహించని స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. తాజాగా దీని విడుదల తేదీ వెలువడింది.
నితిన్ నటించిన 'చెక్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇక, ఈ సినిమా పరాజయం పాలవడంతో ఓటీటీలో త్వరలోనే విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇది విడుదలై చాలా కాలమే అవుతోన్నా అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే మే 14 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో నితిన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చెస్ గేమ్ నేపథ్యంతో వచ్చిన 'చెక్' మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇదిలా ఉండగా.. 'చెక్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. కానీ, కలెక్షన్లు మాత్రం సగానికి సగమే వచ్చాయి. దీంతో ఇది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తద్వారా నిర్మాతకు నష్టాలు ఎదురయ్యాయి.


Click it and Unblock the Notifications











