టాలీవుడ్‌లో షూటింగ్‌లు మొదలు: ఫస్ట్ స్టెప్ వేసిన యూత్ స్టార్ నితిన్
గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం అతడు నటించిన రెండు చిత్రాలు 'చెక్', 'రంగ్ దే' తీవ్రంగా నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈ సారి తక్కవ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అతడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో 'మాస్ట్రో' అనే సినిమాను చేస్తున్నాడు. బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక, తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను ఈరోజు పున: ప్రారంభించారు.
కరోనా వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడేంత వరకూ ఏ సినిమానూ రీస్టార్ట్ చేయకూడదని చాలా మంది దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పట్లో చిత్రీకరణలు జరిగే అవకాశం లేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హైదరాబాద్‌లో 'మాస్ట్రో' షూటింగ్ మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల షెడ్యూల్ మిగిలి ఉండడంతో దీన్ని అందరి కంటే ముందే పున: ప్రారంభించినట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నారట.

నితిన్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈరోజుకు 19 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ 'మాస్ట్రో' షూట్‌ను మొదలు పెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అతడు అంధుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అలాగే, అత్యంత ముఖ్యమైన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించనుంది. హాట్ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











