బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. నితిన్, కీర్తి సురేష్ ట్వీట్స్ వైరల్
యంగ్ హీరో నితిన్ ట్విట్టర్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. సామాజిక సమస్యలపై స్పందించడమే కాకుండా.. సెలెబ్రిటీలకు పంచ్‌లు కూడా వేస్తుంటాడు. ఆ మధ్య రష్మికను ఎంతగా ఏడిపించాడో అందరికీ తెలిసిందే. కుక్క బిస్కెట్స్ తింటుందని సీక్రెట్ బయటకు చెప్పి ఆమె పరువు తీసేశాడు. తాజాగా కీర్తి సురేష్‌ను సైతం ఓ ఆట ఆడేసుకున్నాడు.
నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా.. రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇద్దరు ముద్ద పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్టు, ఎంతో ఇంటెన్సిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది మోషన్ పోస్టర్.

అయితే ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. అను, అర్జున్‌ను పరిచయం చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మోషన్ పోస్టర్‌ను కీర్తి సురేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. క్వారంటైన్ హ్యాపీ బర్త్ డే అర్జున్ అంటూ పేర్కొంది. ఈ పోస్ట్‌కు నితిన్ రిప్లై ఇస్తూ.. బర్త్ డే రేపు అను బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ.. రేపు మళ్లీ విష్ చెయ్.. బై అంటూ కౌంటర్ వేశాడు.


Click it and Unblock the Notifications











