లాక్ డౌన్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం.. రేపే ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్
కరోనా వైరస్ విజృంభించడంతో జనమంతా ఇంటికే పరిమితయ్యారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక ఈ సమయంలో కాలక్షేపానికి ఉండేవి రెండే రెండు. ఒకటి టీవీ, రెండు ఫోన్. ఈ రెండింటితోనే జనమంతా టైమ్ పాస్ చేసేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా రామాయణం, మహా భారతం వంటి సీరియల్స్‌ను మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నాయి.
కరోనా వైరస్ కట్టడి చేసే క్రమంలో దేశమంతా లాక్ డౌన్ విధించేశారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే సోషల్ మీడియా మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. సాధారణ సమయాల్లో ఉండే ఇంర్నెట్ వినియోగం కంటే లాక్ డౌన్ సమయంలోనే ఎక్కువగా ఉంటోంది. ప్రజలంతా మరో పని మీద ధ్యాస పెట్టడమే లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.

అందుకే ఇప్పుడు తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు మెల్లిగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ దుమ్ములేపింది. కరోనాను వెనక్కి నెట్టేసి మరి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకే నితిన్-కీర్తి సురేష్ కూడా తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు రంగంలోకి దిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న రంగ్ దే చిత్రం ఫస్ట్ లుక్‌ను రేపు సాయంత్రం 04:05 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











