యంగ్ హీరో అండ్ హీరోయిన్.. రోమ్‌లో రొమాన్స్
అఆ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేక వెనుకబడ్డాడు యంగ్ హీరో నితిన్. ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం అంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. అయినా ఈ హీరో పట్టు వదలకుండా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నితిన్.. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ, వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రంగ్‌దే చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నాడు.
భీష్మ చిత్రంలో నితిన్‌కు జోడీగా రష్మిక మందాన్న నటింస్తుడటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ చూస్తే వీరిద్దరి మద్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందో తెలుస్తోంది. రొమాంటిక్ సీన్స్ పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది. వీరిద్దరు ప్రస్తుతం రోమ్‌లో ఉన్నారు. ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించేందుకు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఛలో మ్యూజిక్ డైరెక్టర్, మణిశర్మ తనయుడు మహతి సాగర్ ట్యూన్ చేసిన రొమాంటిక్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ మేరకు అక్కడ దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. వారం రోజుల పాటు చిత్రీకరణ జరుపనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి మూడవ వారంలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











