నితిన్ మూవీ అప్డేట్... దీపావళికి దుమ్ములేపుడే
అఆ చిత్రం మళ్లీ అంతటి విజయాన్ని పొందలేక వెనుకబడ్డ హీరో నితిన్.. ఈ ఏడాది శ్రీనివాస కళ్యాణం అంటూ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయినా సరే పట్టువదలకుండా వరుస ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ, వెంకీ అట్లూరితో రంగ్ దే, మరో రెండు చిత్రాలను కూడా లైన్లో పెట్టాడు. భీష్మ చిత్రంలో రష్మీక మందాన్నతో జోడి కడుతుండగా.. రంగ్ దే చిత్రంలో కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది.

అందరూ హీరోలు దీపావళి కానుకగా తమ అభిమానులకు ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుండగా.. నితిన్ కూడా తన ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేందుకు రెడీ అయ్యాడు. దీపావళి కానుకగా భీష్మ మూవీ నుంచి ఓ అప్డేట్ రానుందని ప్రకటించాడు.
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో చేస్తోన్న భీష్మ మూవీ ఫస్ట్ లుక్‌ను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు నితిన్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











