Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తూ క్షణం తీరిక లేకండా షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. గతేడాది వరుసగా నాలుగు చిత్రాలు రిలీజ్ చేయాలని ఎంతో తాపత్రయ పడ్డాడు. అన్నింటి కోసం సరిగ్గానే ప్లాన్ వేసుకున్నాడు. కానీ కరోనా వచ్చి మొత్తం తారుమారు చేసింది. అలా గతేడాది ఒక్క భీష్మ చిత్రంతోనే సరిపెట్టేసుకున్నాడు. అలా మిగిలిన చిత్రాలను ఈ ఏడాది సరిగ్గా ప్లాన్ వేసుకున్నాడు.
నితిన్ ప్రస్తుతం రంగ్ దే, చెక్, అంధాదున్ రీమేక్ షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. ఇందులో రంగ్ దే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, టీజర్, పోస్టర్లతో హైప్ పెంచేశారు. చెక్ సైతం అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. చెస్ చాంపియన్, ఉగ్రవాది, జైల్లో ఎందుకుఉన్నాడు వంటి ప్రశ్నలను రేకెత్తి మంచి హైప్ క్రియేట్ అయ్యేలా టీజర్లను వదిలారు. మొత్తానికి నితిన్ సినిమాలన్నీ వరుసబెట్టి వచ్చేందుకు రెడీ అయ్యాయి.
రంగ్ దే సినిమాను సమ్మర్ స్పెషల్గా విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. తాజాగా చెక్ సినిమా అప్డేట్ను కూడా ప్రకటించారు. చెక్ సినిమాను ఫిబ్రవరి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తోండగా.. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది.