Extra Ordinary Man: సెన్సార్ పూర్తి చేసుకున్న నితిన్ సినిమా.. ఏ సర్టిఫికేట్ వచ్చిందో, రన్ టైమ్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ అందగాడు.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భీష్మ తర్వాత ఫ్లాపులుగా నిలిచిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాలో నితిన్ పక్క మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అలాగే ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ షిప్ పూర్తి చేసుకుంది. అయితే ఏ సర్టిఫికేట్ వచ్చింది, రన్ టైం ఎంత అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం.

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ అందజేసింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను 3 గంటల 36 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ... చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ ఫిప్ పూర్తి చేసుకుంది అంటూ వెల్లడించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మరి సినిమా ఏ రేంజ్ లో అలరించబోతుంది, ఏ మేర కలెక్షన్లు వసూలు చేస్తుందనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓలే ఓలే పాపాయి సాంగ్ విడుదల కాగా... అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ మాస్ బీట్ తో సాగిన ఈ పాటలో నితిన్, శ్రీలీలలు తమ స్టెప్పులతో అదరగొట్టారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హరీస్ జయరాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో నితిన్, శ్రీలీలలతో పాటు పవిత్రా లోకేష్, హర్ష వర్ధన్ నటించబోతున్నారు. అయితే నితిన్ సినిమా విడుదల అవుతున్న రోజే నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా కూడా విడుదల కాబోతుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.



Click it and Unblock the Notifications











