ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. రంగ్ దే ప్రమోషన్స్ జోరు

మంచి ఊపు మీదున్న నితిన్‌కు చెక్ రూపంలో దెబ్బ తగిలింది. మంచి టాక్ వచ్చినా కూడా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం సత్తా చాటలేపోయింది. అలా చెక్ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు తన దృష్టినంతా కూడా రంగ్ దే సినిమా మీదే పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరును పెంచేశాడు. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు రంగ్ దే యూనిట్ మంచి ప్లాన్ వేసింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటూ సరికొత్తగా ప్లాన్ చేసింది రంగ్ దే బృందం. ఈక్రమంలో తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజ్‌లో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్టు తెలిపారు. మార్చి 19న సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నట్టు తెలిపారు. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ వేడుకగా మార్చినట్టున్నారు.

Nithin Rang de Trailer Launch Event On 19th march

సితారా ఎంటర్టైన్మైంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే వదిలిన పాటలన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ఇక కీర్తి సురేష్, నితిన్ జంట కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ మూవీని వెంకీ అట్లూరి తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పీసీ శ్రీరాం కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X