Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మొన్న రామ్ చరణ్-సానియా.. నిన్న నితిన్-రష్మిక.. ఆ పాటకు స్టెప్పులు వైరల్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డ్యాన్సులు అందరికీ తెలిసిందే. ఆంధ్రా మైఖేల్ జాక్సన్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే బాలీవుడ్లో తీగలా మెలికలు తిరిగే స్టెప్పులేసే హృతిక్ రోషన్ గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. గ్రీకు శిల్పంలా అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హృతిక్ తన స్టెప్పులతో ఎందరినో ఫిదా చేశాడు. ఈ మధ్య వార్ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ మీద యుద్దం ప్రకటించాడు. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
యాక్షన్, స్టెప్పులు వైరల్..
ఈ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ చేసిన విధ్వంసం, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియెన్స్‌ను అబ్బుర పరచగా.. వసూళ్ల సునామిని సృష్టించింది. ఈ చిత్రంలోని హృతిక్ స్టెప్పులు సైతం అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గుంగ్రూ అనే పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఈ పాటకు తెలుగు నాట కూడా హల్ చల్ చేస్తున్నాయి.
మొన్న రామ్ చరణ్-సానియా..
రీసెంట్గా సానియా మీర్జా సోదరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో రామ్ చరణ్-ఉపాసన ప్రత్యక్షమవ్వడం, సానియా మీర్జాతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకల్లో రామ్ చరణ్-సానియా కలిసి వార్ చిత్రంలో గుంగ్రూ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
|
నేడు నితిన్-రష్మిక
యూత్‌లో ఫుల్ క్రేజీ హీరోయిన్గా మారిన రష్మిక, నితిన్‌తో కలిసి భీష్మ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు రోమ్ నగరంలో ఉన్నారు. భీష్మ సినిమాలో పాటలను చిత్రీకరించేందుకు అక్కడికి వెళ్లింది చిత్రయూనిట్. ఈ క్రమంలో హృతిక్ పాటకు స్టెప్పులేశారు.
హృతిక్‌కు అంకితం..
గుంగ్రూ పాటకు రొమాంటిక్ స్టెప్పులేసి అందర్నీ ఆకట్టుకుంది ఈ జంట. సముద్ర తీరాన అందమైన లొకేషన్లలో వీరు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భీష్మ ఫస్ట్ సింగిల్ కోసం నితిన్-రష్మిక చేసిన డ్రామా బాగానే పండింది. సింగిల్స్ ఆంథమ్ నేటి సాయంత్రం విడుదల కానుంది.