'భీష్మ' హిట్.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇది! నితిన్ కామెంట్స్
'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వైజాగ్ లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో 'భీష్మ' డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ మెంబర్లకు వరుణ్ తేజ్, నితిన్, రష్మిక, వెంకీ జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్బంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. "పవన్ కల్యాణ్ గారు ఆరడుగుల బుల్లెట్ అయితే, మా వరుణ్ ఆరడుగుల నాలుగంగుళాల బుల్లెట్. ఆయన రాలేకపోయినా మా వరుణ్ గారు వచ్చారు. ఈ ప్రొడ్యూసర్ తో నా మొదటి సినిమా 'అ ఆ' పెద్ద హిట్టయింది. ఇది మా రెండో సినిమా. కల్యాణ్ గారిని మొన్ననే కలిశాను. సినిమా హిట్టయినందుకు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ వారంలో సినిమా చూస్తానని చెప్పారు. ఆయన సినిమా చూశాక మళ్లీ కలుస్తాను. 'భీష్మ' సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్.

నాలుగేళ్ల తర్వాత మళ్లీ నాకు హిట్ వచ్చింది. ఈ హిట్ ను నాకిచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్ వెంకీకి థాంక్స్ చెప్పుకుంటున్నా. రష్మిక గారు చాలా చాలా బాగా చేశారు. మా ఫస్ట్ కాంబినేషన్ మంచి హిట్టయింది. ఈ సినిమాలో ఆమె డాన్సులు 'నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్' (రష్మికను చూస్తూ 'ఏవండీ మీకు అర్థమవుతుందా!' అన్నారు). మా ఇద్దరి కాంబినేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాగర్ మహతి చాలా మంచి మ్యూజిక్ ఇస్తే, నవీన్ నూలి ఎడిటింగ్ బాగా చేశాడు. సెకండాఫ్ లో వెంకట్ మాస్టర్ అదిరిపోయే ఫైట్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్, శ్రీమణి చక్కని లిరిక్స్ ఇచ్చారు. అజయ్ తో నాది హిట్ కాంబినేషన్" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











