ప్రభుత్వానికి సాయం.. కేసీఆర్‌కు చెక్కు అందజేసిన నితిన్

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం శక్తి వంచన లేకుండా పోరాడుతోంది. ఇప్పటి వరకు విరుగుడు కనుక్కోలేకపోవడం.. నానాటికి వైరస్ తన ప్రతాపాన్ని చూపెడుతుండటంతో మానవాళి భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారి చేశాయి.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా మాస్కులు ధరించాలి, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పదే పదే ప్రభుత్వాలు నొక్కి వక్కానిస్తున్నాయి. సెలెబ్రిటీలు సైతం ఇంటి పట్టునే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరికొంత మంది హీరోలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Nithin Ten Lakhs Cheque To CM Relief Fund To Fight With Coronavirus

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సాయంగా యంగ్ హీరో నితిన్.. పది లక్షల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇరవై లక్షలను ప్రటించాడు. అందులో భాగంగా నేడు సీఎం కేసీఆర్‌ను కలిసి.. పది లక్షల చెక్కును అందజేశాడు. తన బాధ్యతను నిర్వర్తించి, ఆర్థిక సాయాన్ని ప్రటించిన నితిన్ పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సహాయనిధికి 10 లక్షల చెక్ అందించిన నితిన్ కేసీఆర్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X