‘విరాట పర్వం’పై అంచనాలు పెంచిన నివేథా: అది కాసేపే అయినా కష్టమైనదని క్లారిటీ

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు 'విరాట పర్వం' అనే సినిమాలో నటించాడు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల మాత్రం అవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 'విరాట పర్వం' మూవీపై హీరోయిన్ నివేథా పేతురాజ్ అంచనాలు పెంచేసింది.

'విరాట పర్వం' సినిమాలో నివేథా పేతురాజ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. 'విరాట పర్వంలో నా పాత్ర చాలా తక్కువ సేపే ఉంటుంది. కానీ, ఎంతో చక్కగా ఉంటుంది. ఇది నా కెరీర్‌లోనే ఎంతో కష్టమైన రోల్. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్న సమయంలో చిత్రీకరణ జరిపాం. అవన్నీ ఎంతో చక్కగా వచ్చాయి. సినిమాను ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు' అని చెప్పింది. తద్వారా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది.

 Nivetha Pethuraj Clarity about her Role in Virata Parvam

మన్యం ప్రాంతంలో పుట్టిన సున్నితమైన ప్రేమకథకు నక్సలిజం అనే పాయింట్‌ను జోడిండి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దగ్గుబాటి రానా కామ్రెడ్ రవన్నగా నటిస్తుండగా.. సాయి పల్లవి పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పోస్టర్లు, పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X