వకీల్ సాబ్ ఈవెంట్ మీకోసమే.. అభిమానులకు నివేదా థామస్ రిక్వెస్ట్
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఎంతటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే బుక్సింగ్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? లేదా? అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగింది. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఇలాంటి ఈవెంట్లకు అనుమతి ఇవ్వరని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం కుదిరింది.
నేటి సాయంత్రం శిల్పా కళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్ రావడంతో వకీల్ సాబ్ యూనిట్ మొత్తం షాక్ అయింది. ఎందుకంటే దర్శకుడు వేణు శ్రీ రామ్, అనన్య నాగళ్ల, అంజలి ఇలా అందరూ కలిసి మీడియాతో ముచ్చటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనకు కరోనా పాజిటివ్ అని నివేదా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

తాజాగా వకీల్ సాబ్ ఈవెంట్ గురించి నివేదా మాట్లాడుతూ అభిమానులకు కొన్ని సూచనలు చేసింది. ఈ రోజు మీ అందరినీ కలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో మీరు నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నాను. మాస్క్ తీయకండి.. భౌతిక దూరం పాటించండి.. ఈవెంట్ జరిగే చోట జాగ్రత్తగా ఉండండి.. ఈ ఈవెంట్ మీకోసమే. జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి అని నివేదా థామస్ కోరింది.


Click it and Unblock the Notifications











