twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్‌ను అన్న అనేసిన హీరోయిన్.. బ్రిలియంట్ అంటూ ప్రశంసలు

    |

    అల్లరి నరేష్ తన బర్త్ డే సందర్భంగా రెండు విభిన్న చిత్రాల గురించి పరిచయంచేశాడు. అందులో ఒకటి నాంది. మరొకటి బంగారు బుల్లోడు. ఈ రెండూ బాగానే క్లిక్ అయ్యాయి. అయితే రెండింటిలోనూ నాంది టీజర్ అందర్నీ ఎక్కువగా ఆకట్టుకుంది. మహర్షి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసిన అల్లరి నరేష్ నాంది చిత్రంతో మరో కొత్త ప్రయోగం చేయబోతోన్నాడు. పోస్టర్లతోనే అంచనాలు పెంచేసిన అల్లరి నరేష్ టీజర్‌తో అందర్నీ షాక్‌కు గురి చేశాడు.

    '2015 నాటికి 1401 జైళ్లు ఉంటే.. 3,66,781 మంది రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే అందులో దాదాపు 2,50,000 మంది నేరం చేశారో లేదో తెలియకుండానే అండర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు' అంటూ వచ్చిన వాయిస్ ఓవర్‌లోనే సినిమా థీమ్ ఏంటో చూపించాడు. ఇక చివర్లో 'ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే టైమ్ పడుతుంది. కానీ నాకు న్యాయం చేప్పడానికేంటి సర్..ఇన్ని సంవత్సరాలు పడుతోంది..' అని అల్లరి నరేష్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది.

    nivetha thomas Reaction On Allari Naresh Naandhi teaser

    ఇక నాంది టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. మిలియన్ల వ్యూస్‌తో నాంది టీజర్ దూసుకెళ్లింది. అయితే ఈ టీజర్‌పై నివేదాథామస్ స్పందించింది. ఈ మేరకు అల్లరి నరేష్‌ను అన్నా అని సంభోదించింది. అంతేకాకుండా ఇది బ్రిల్లియెంట్‌గా ఉందని, సినిమాను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే అల్లరి నరేష్‌ను అన్న అని సంబోధించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    nivetha thomas Reaction On Allari Naresh Naandhi teaser. nivetha thomas Called Allari Naresh as Brother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X