బాలయ్యకు షార్ట్ టెంపర్, మహిళలతో ఆయన ఉండే విధానం అలానే ఉంటుంది.. నగ్నం బ్యూటీ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయాయి. కొందరు అయితే పెద్ద స్టార్స్ ని టార్గెట్ చేస్తూ బాగానే పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. హీరోలపై స్పందిస్తే అభిమానుల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ మొదలవుతుంది. ఇక రీసెంట్ గా శ్రీ రాపాక కూడా నందమూరి అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేసింది. బాలకృష్ణ ప్రవర్తనపై ఆమె కొన్ని కామెంట్స్ చేశారు.

వరుస ఇంటర్వ్యూలతో..
రామ్ గోపాల్ వర్మ అడల్ట్ మూవీ NNN ద్వారా ఇటీవల బాగా క్రేజ్ అందుకున్న శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. నగ్నం సినిమాలో ఆమె నటించిన విధానం అందరిని షాక్ కి గురి చేసింది. బోల్డ్ గా నటించడానికి పెద్దగా భయపడ లేదని అంతా తెలిసే సినిమాలో నటించాను అని ఆమె వివరణ ఇచ్చింది.

స్టార్ హీరోలతో..
ఫ్యాషన్ డిజైనర్ గా శ్రీ రాపాక గత పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ అనే కాకుండా ఇతర స్టార్ హీరోలతో కూడా ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేశారు. బయట జనాలకు ఆమె నగ్నం సినిమా ముందు వరకు ఎవరో తెలియదు. కానీ దాదాపు అందరి హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఆమెకు ఉండడంతో ప్రతి ఒక్క హీరో తనకు తెలుసని అందరు చాలా ఫ్రెండ్లిగా ఉంటారని తెలిపింది.

ముక్కు మీద కోపం అనగానే..
ఇక బాలకృష్ణతో ఒకసారి మాట్లాడాలని ఆయనకు ఇంటికి వెళ్లానని చెబుతూ ఈ విధంగా వివరణ ఇచ్చింది.. ఆయనకు ముక్కు మీద కోపం ఉంటుందని కొందరు చెప్పారు. ఆ విషయం తెలుసుకోగానే కొంత భయం వేసింది. ఇంటికి కూడా భయం భయంగానే వెళ్ళాను. బాలయ్య గారితో కొద్దీ సేపు మాట్లాడిన తరువాత నాలో ఉన్న భయాలన్ని పోయాయి.
Recommended Video

మహిళలతో మర్యాదగా..
బాలకృష్ణ గారిది పూర్తిగా చిన్న పిల్లల మనస్తత్వం. మనసులో ఒకటి బయట వేరొకటి ఉండదు. మనసులో అనుకున్నదే చాలా స్పష్టంగా వివరణ ఇస్తారు. అప్పుడే ఆయన గురించి అర్థమైంది. కాకపోతే ఆయనకు కొంచెం షార్ట్ టెంపర్. చాలా తొందరగానే కోపం వస్తుంది. కాకపోతే అది ఎక్కువ సేపు ఉండదు. వెంటనే కూల్ అయిపోతారు. ఇక మహిళలతో ఆయన చాలా హుందాగా మర్యాదగా ప్రవర్తిస్తారు అని శ్రీ రాపాక వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











