పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఇక పండగే: ఆ విషయంలో మాత్రం తగ్గేదేలేదట

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పరిచయం అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ స్టార్ మరింత వేగంగా మూవీలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పవన్.. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. పిరియాడిక్ జోనల్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

క్రేజీ కాంబోలో రాబోతున్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు వరుసగా బ్రేక్‌లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పాటు తీరిక లేని షెడ్యూళ్ల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అదే జరిగితే మూవీ వాయిదా పడుతుందని కూడా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

No Changes in Pawan Kalyan Harihara Veeramallu Release

పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు షికార్లు చేస్తోన్న నేపథ్యంలో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేయబోతున్నారట. ఇప్పటికే దీనిపై ఈ స్టార్ హీరో కూడా స్పష్టత ఇచ్చేశాడని తెలిసింది. అంటే.. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. అయితే, దీని తర్వాత మాత్రం పవన్ గ్యాప్ తీసుకోబోతున్నాడని తెలిసింది.

పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' సినిమాలో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X