హరిహర వీరమల్లుపై పవన్ కీలక నిర్ణయం: ఇక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చట
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత వేగంగా మూవీలు చేస్తున్న ఈ హీరో.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. పిరియాడిక్ జోనల్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి.
వాస్తవానికి 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణకు వరుసగా బ్రేక్‌లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పాటు పోరాటాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతుంది.

సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ విషయంలో పవన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని లేదని తెలిసింది. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే అక్టోబర్ చివరి వారం నుంచి పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని సెట్లను కూడా ఇప్పటికే నిర్మించి పెట్టింది.
'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











