Project K: ప్రభాస్ సినిమా వాయిదా.. ఇదిగో అసలైన క్లారిటీ
హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత నుంచి ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు చేతిలో నాలుదైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 'Project K' ఒకటి. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో బిగ్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్టుతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'Project K' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కాలం పాటు జరిగింది. అలాగే, గత ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చిత్ర యూనిట్ హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు కొందరు కీలక నటులతో పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. అలాగే, ఇటీవలే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ నటిస్తోన్న 'Project K' మూవీ షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. దీంతో ఆయన షూటింగ్‌కు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయడం లేదని తెలిసింది. అమితాబ్ త్వరలోనే వచ్చి షూట్‌లో పాల్గొంటారని, అప్పటి వరకూ వేరే పార్ట్‌ను చిత్రీకరించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీంతో ఈ అయోమయానికి తెరపడినట్లు అయింది.
టైం ట్రావెల్ కథతో రూపొందుతోన్న 'Project K' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన సైంటిస్ట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











