Pawan Kalyan: భీమ్లా నాయక్ వాయిదా పై కన్ఫ్యూజన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో యుద్ధం జరగనున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేవన్ని కూడా పెద్ద సినిమాలే. RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాల విడుదల డేట్స్ పై ఇదివరకే క్లారిటీ ఇవ్వగా ఈ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ సినిమాపై మరోసారి రూమర్స్ వైరల్ అవ్వగా ఫైనల్ గా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు.

అఖండ ధైర్యం..

అఖండ ధైర్యం..

మొత్తానికి అఖండ సినిమాతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కు థమన్ మ్యూజిక్ తొడవ్వడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా కలెక్షన్స్ వచ్చాయి. ఇక రాబోయే బిగ్ బడ్జెట్ సినిమాలకి అఖండ కొండంత ధైర్యం ఇచ్చినట్లు అయ్యింది. ఇక సంక్రాంతి సినిమాలకు కూడా మంచి ఎనర్జీ అని చెప్పవచ్చు.

RRRలో డౌట్ లేదు

RRRలో డౌట్ లేదు

ముందుగా RRR సినిమా జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను 9వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై మళ్ళీ నిర్ణయం మార్చుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల విడుదల చేసిన చరణ్ తారక్ పోస్టర్ల ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

వాయిదా అన్నారు..

వాయిదా అన్నారు..

ఇక భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. నేడు ఉదయం కూడా చిత్ర నిర్మాతల మధ్యలో చర్చలు జరిగిన అనంతరం వాయిదా వేసుకునేందుకు ఆసక్తి చూపినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. జనవరి 12న రావాల్సిన భీమ్లా నాయక్ వాయిదా పడిందని త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు స్టోరీలు అల్లెశారు.

 భీమ్లా నాయక్.. అదే డేట్!

భీమ్లా నాయక్.. అదే డేట్!

ఇక ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయంలో ఎలాంటి అనుమానం లేదని చిత్ర నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న భీమ్లా నాయక్ సినిమా అనుకున్న సమయానికి జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా సినిమా రష్ చూసినట్లు చెబుతూ.. మార్క్ చేసుకోండి. జనవరి 12న థియేటర్స్ ను బ్లాస్ట్ చేయడం కాయమని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

న్యూ ఇయర్ కానుకగా..

న్యూ ఇయర్ కానుకగా..

దీంతో అభిమానులు ఆ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రూమర్స్ కు చెక్ పెడుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను 2022 న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ బాక్సాఫీస్ పోటీలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యదిక ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి. జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్ విడుదల కానున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X