Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
త్రివిక్రమ్, మహేష్ కాంబో.. అక్కడ స్పెస్ లేదు.. కానీ క్రియేట్ చేసుకుంటున్నారు
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్స్ సెట్స్ పైకి వచ్చాయి అంటే షూటింగ్ మొదలైనప్పటికి నుంచే అంచనాల డోస్ ఆకాశాన్ని తాకుతాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు కూడా ఏ స్టార్ హీరోను లైన్ లో పెట్టినా కూడా ఈజీగా బజ్ క్రియేట్ అవుతుంది. ఇక చాలా కాలం తరువాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కాంబినేషన్ సెట్టవుతుంది కానీ ఇద్దరికి ఖాళీ లేని సమయంలో ఎప్పుడు సెట్స్ పైకి తెస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వచ్చినా కూడా..
అతడు లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఖలేజా. ఆ సినిమా అనుకోని కారణాల వల్ల షూటింగ్ దశలోనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక సినిమా విడుదలైన తరువాత కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత త్రివిక్రమ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నప్పటికి మహేష్ తో సినిమా చేయలేదు.
క్లారిటీ ఇచ్చిన మహేష్..
ఇక అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మహేష్ మళ్ళీ ఆ దర్శకుడిపై ఫోకస్ పెట్టినట్లు లాక్ డౌన్ మొదలైనప్పటికి నుంచి కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే మహేష్ ఖలేజా 10ఏళ్ళయిన సందర్భంగా త్రివిక్రమ్ తో నెక్స్ట్ మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాను. అతి త్వరలో.. అంటూ మహేష్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
స్పెస్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు
అయితే అతి త్వరలో అనేది అంత తొందరగా రాదని అర్ధమయ్యింది. అసలు ఇద్దరికి కూడా రానున్న రోజుల్లో కాస్త కూడా స్పెస్ దొరకనంత బిజీగా ఉంటారు. మొదట కొంచెమైనా గ్యాప్ దొరికితే స్టార్ట్ చేయాలని అనుకున్నారట. కానీ మహేష్ సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ముగిసిన కూడా త్రివిక్రమ్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసేవాడు.
ఇప్పట్లో త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ లేనట్లే..
ఇక మరోవైపు త్రివిక్రమ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. RRR తో బిజీగా ఉన్న తారక్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ లోపు ఒక సినిమాని పూర్తి చేయవచ్చట. ఇక మహేష్ తో అనుకున్న ప్రాజెక్టును తెరకెక్కించాలి అనుకుంటే మహేష్ న్యూ లుక్ తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ చేసి ఉంచాడు. సర్కారు వాటి పాట అయిపోతే మళ్ళీ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెడీ అవ్వాలి కాబట్టి ఇప్పట్లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేలా లేదని అర్ధమవుతోంది.