షాకింగ్ అప్‌డేట్: బాలయ్య నోటికి తాళం వేసిన డైరెక్టర్.. ఆయన సినిమాల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు.!
మాస్ డైరెక్టర్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాంబినేషన్ అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రెండు భారీ హిట్ల తర్వాత వస్తున్న సినిమా అయితే.. చెప్పుకోడానికి కూడా వీలుండదు. ఇప్పుడు బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా విషయంలో అదే జరుగుతోంది. చాలా కాలం తర్వాత ఈ జంట కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

బాలయ్యకు అస్సలు కలిసి రాలేదు
2019వ సంవత్సరం నందమూరి బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదు. దీనికి కారణం గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు విడుదలవ్వగా.. అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలకు అయితే.. ఆయనే నిర్మాతగానూ వ్యవహరించారు. దీంతో నష్టాలు కూడా వచ్చాయి.

కష్ట సమయంలో ఆయనతో కలిశాడు
నందమూరి బాలకృష్ణ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఆయన.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా తెరకెక్కనున్న మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

యాక్షన్ మొదలెట్టిన నందమూరి హీరో
బోయపాటి శ్రీను - బాలయ్య సినిమా పూజా కార్యక్రమాలు జరిగి చాలా కాలం కావొస్తుంది. వాస్తవానికి రెగ్యూలర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, సోమవారం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షూటింగ్‌లో బాలయ్యపై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు.

ఆ విషయంలో మాత్రం క్లారిటీ లేదు
ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అదే సమయంలో ఈ సినిమా కథ, హీరోయిన్ ఎంపిక, బాలయ్య రోల్స్, ఇతర నటీనటుల గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే.. ఇందులో నటించే హీరోయిన్ విషయంలోనూ పలు పేర్లు చర్చకు వచ్చినప్పటికీ.. ఇంత వరకూ క్లారిటీ రావడం లేదు.

బాలయ్య నోటికి తాళం వేసిన డైరెక్టర్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బోయపాటి, బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నందమూరి హీరో అయితే కొంత ఎక్కువగానే శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ మూవీలో బాలయ్య రెండు గెటప్స్‌లో నటిస్తుండగా.. అందులో ఒక దానిలో ఆయన మాట్లాడకుండా కనిపించబోతున్నారట.
Recommended Video


ఆయన సినిమాల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు.!
నిజానికి బాలయ్య సినిమా అంటే ఎన్నో పవర్‌ఫుల్ అండ్ లెంగ్తీ డైలాగులు ఉంటాయి. దర్శకులందరూ ఆయనను దృష్టిలో ఉంచుకుని మరీ సంభాషణలు రాస్తుంటారు. అయితే, బోయపాటి మాత్రం సరికొత్త ప్రయోగం చేస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర అస్సలు మాట్లాడదని అంటున్నారు. మరో పాత్ర మాత్రం మామూలుగా ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











