నితిన్.. రొమాన్స్ లేకుండా ఆ కథకు న్యాయం చేయగలడా?
రీమేక్ సినిమాలను తెరకెక్కించడం చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. కానీ సీనియర్ దర్శకులని ఈ విషయం అడిగితే వారే చెబుతూ ఉంటారు చాలా కష్టమైన పని అని. ఎందుకంటే ఒక్క సీన్ బాగోలేదని చేంజ్ చేసినా అది సినిమా మొత్తంపై ప్రభావం చూపవచ్చు. అలాగే మన తెలుగు వాళ్ళ కోసం కథ మార్చినా కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. ఇక నితిన్ అందాధూన్ రీమేక్ విషయంలో మార్పులు చాలానే జరగనున్నట్లు తెలుస్తోంది.
గత నెల సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. హిందీలో టబు చేసిన బోల్డ్ పాత్ర కోసం తమన్నాను ఫిక్స్ చేశారు. ఇక రాధిక ఆప్టే చేసిన గ్లామరస్ రోల్ కోసం నాభా నటేష్ ని ఫైనల్ చేశారు. నిజానికి టబు, రాధిక చేసిన పాత్రలు సినిమాలో మెయిన్ హైలెట్ అని చెప్పవచ్చు. అలాంటి పాత్రల్లో ఏ మాత్రం మార్పులు చేసినా కూడా మొదటికే మోసం వస్తుంది. ఏదేమైనా కూడా దర్శకుడి పనితనం మీద అది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

దర్శకుడు మెర్లపాక గాంధీ ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. బోల్డ్ నెస్, రోమాన్స్ అనేవి ఎక్కువగా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చేలా సినిమా స్క్రిప్ట్ కొత్తగా రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నితిన్ అయితే ప్రస్తుతం రంగ్ దే సినిమాకు ఎండ్ కార్డ్ పెట్టె పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా తరువాత అందాదున్ రీమేక్ తో బిజీ కానున్నాడు నితిన్.


Click it and Unblock the Notifications











