మహేశ్ బాబు అభిమానులకు షాకింగ్ న్యూస్: ఆ మూవీ నుంచి సర్‌ప్రైజ్ ఏదీ ఉండదట
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఈ మధ్య కాలంలో అతడు వరుస విజయాలను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ కారణంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న 'సర్కారు వారి పాట' మూవీ నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా నుంచి వచ్చేది టీజర్ అని బాగా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మహేశ్ బాబు మూవీ నుంచి పోస్టర్‌గానీ, పాట గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆరోజు 'సర్కారు వారి పాట' టీజర్ అయితే విడుదల కావడం లేదట. అసలు అలాంటి ప్లాన్‌లోనే చిత్ర యూనిట్ లేదని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

టీజర్ అయితే రావడం లేదు కానీ.. పోస్టర్ గానీ, పాట గానీ విడుదల కావొచ్చు అని అంటున్నారు. ఫ్యాన్స్‌ను కొంతలో కొంతైన సంతోష పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బ్యాంకులను మోసం చేస్తున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











