పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాక్.. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మైత్రీ సంచలన నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఓజీ లాంటి భారీ హిట్ తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆకాశాన్ని అంటే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ తీసుకొన్న నిర్ణయం పవర్ స్టార్ అభిమానులకు కొంత నిరాశే కలిగించింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తమిళ హీరో, దళపతి విజయ్ నటించిన థెరీ సినిమా ఆధారంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్నదనే వార్తకు తాజాగా ఆ సినిమా టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హరీష్ శంకర్ తన సొంత కథతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పకనే చెప్పారు. అయితే ఈ సినిమాను మార్చి 27వ తేదీన రిలీజ్ చేయాలని తొలుత భావించారు. అయితే టాక్సిక్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ మూవీని మార్చి 19వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. దాంతో ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లువిరుస్తున్నది.
అయితే ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో ప్రీమియర్లను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని అభిమానులు కసరత్తు మొదలుపెట్టారు. ఒక రోజు ముందే అంటే మార్చి 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్న సమయంలో.. పెయిడ్ ప్రీమియర్లు, ఫ్యాన్స్‌లు ప్రదర్శించబోమని మైత్రీ మూవీ మేకర్స్ తేల్చేశారు. ఈ సినిమా మొదటి ఆట ఇండియాలో మార్చి 19 తేదీ ఉదయం 5 గంటలకు ప్రదర్శిస్తారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే అధికారికంగా మాత్రం మైత్రీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ విషయంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే ప్రీమియర్ షోలు, ఫ్యాన్స్ షోలు లేకపోతే పవర్ స్టార్ అభిమానులు నిరుత్సాహ పడటం గ్యారెంటీ. అభిమానుల జోష్‌ను ఎలా నిర్మాతలు మేనేజ్ చేస్తారు. ఈ సినిమా విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల అనుమతి కోరి ప్రీమియర్లను ప్రదర్శిస్తారా? లేదా అనే విషయం భారీ చర్చకు దారి తీస్తున్నది. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల పెంపు వ్యవహారం గురించి కూడా భారీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదు. కానీ ఏపీలో టికెట్ రేట్లు పెంపు కొనసాగుతుందనే ఊహాగానాలు మీడియాలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











