జానీ మాస్టర్ కేసులో భారీ ట్విస్టు.. షాకింగ్‌గా తెలంగాణ పోలీసులు బిగించిన ఉచ్చు!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ లైంగిక దాడి కేసు మరో మలుపు తిరిగింది. సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసులు ఆయనకు భారీ షాకిచ్చారు. ఇప్పటి వరకు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. దాంతో ఆయననను విచారించకుండానే కస్టడీలోకి తీసుకొని అవకాశం ఉంది. రిమాండ్ కస్డడీలో విచారించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్దమయ్యారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ వద్ద గత ఆరేళ్లుగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ డ్యాన్సర్ ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు నార్సింగి పోలీస్ పరిధిలోకి రావడంతో అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు.

Non Bailable Case filed on Jani Master Narsingi Police in Search for Arrest

అయితే తాజాగా నార్సింగి పోలీసులు బాధితురాలిని విచారించిన తర్వాత జానీ మాస్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తాను 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ముంబైలో ఓ ఈవెంట్‌కు వెళ్లగా అక్కడ హోటల్ రూమ్‌లో తనపై అత్యాచారం చేశారని వెల్లడించింది.

దాంతో మైనర్ బాలికపై అత్యాచారం కేసుగా పరిగణించి ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ (POCSO)యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Non Bailable Case filed on Jani Master Narsingi Police in Search for Arrest

జానీ మాస్టర్‌‌పై కేసు నమోదు చేసిన తర్వాత ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తొలుత లడఖ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో ఓ బృందం అక్కడికి వెళ్లారు. అయితే ఆయన పరారీలో ఉన్నారనే విషయంతో మరో మూడు టీమ్‌లను రంగంలోకి దించారు. ఆయనను అరెస్ట్ చేసి కేసులో విచారిస్తామని రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పోలీసులు వెల్లడించారు.

More from Filmibeat

Read more about: jani master tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X