Don't Miss!
- News
Lady: భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియుడికి రసగుల్లా ఇచ్చింది, ప్రియురాలి కూతుర్ని ఏం చేశాడంటే ?
- Sports
Joginder Sharma: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్ హీరో!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్‌ను మోసం చేస్తున్న హీరోయిన్: ఆమె ఆట ఎలా కట్టించబోతున్నాడో తెలిస్తే!
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' మూవీతో కమ్ బ్యాక్ అయిన అతడు.. ఆ తర్వాత 'భీమ్లా నాయక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలకు భారీ రెస్పాన్స్ దక్కడంతో మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' అనే మూవీలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.
కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!
మూవీ మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.

చారిత్రక నేపథ్యంతో క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తుందట. అంతేకాదు, పవన్ కల్యాణ్ పక్కనే ఉంటూ అతడిని మోసం చేస్తుందని తెలిసింది. ఆ సమయంలో వీరమల్లుకు చాలా నష్టం జరుగుతుందట. అయితే, చివర్లో మాత్రం ఆమెను అంతే దెబ్బ కొట్టి అతడు ఆట కట్టిస్తాడని తెలిసింది. అంతేకాదు, నోరాతో కలిసి పవన్ చేసే ఓ సాంగ్ హైలైట్‌గా ఉండబోతుందట.
బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు.