‘పుష్ప’ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ: బాహుబలి తర్వాత మరోసారి భారీ ప్రాజెక్టులో భాగం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో అతి తక్కువ ప్రాజెక్టులు మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుని.. భారీ అంచనాలను ఏర్పరచుకున్నాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బడా డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప' ఒకటి. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గురించి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'పుష్ప' మూవీలో బాలీవుడ్ బ్యూటీ భాగమైనట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప' రాజ్‌గా మారిపోయిన బన్నీ

‘పుష్ప' రాజ్‌గా మారిపోయిన బన్నీ

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకిలా

పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకిలా

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో 'పుష్ప' మూవీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ కోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడని తెలిసింది.

రెండు భాగాలుగా రిలీజ్.. షూట్ ఇలా

రెండు భాగాలుగా రిలీజ్.. షూట్ ఇలా

ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్ షూట్‌‌ను జరుపుతున్నారు.

రిలీజ్‌కు ముందే నేషనల్ రికార్డులు

రిలీజ్‌కు ముందే నేషనల్ రికార్డులు

'పుష్ప' నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియో వచ్చింది. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఇటీవలే 'దాక్కో దాక్కో మేక' పాటను వదలగా ఇది దేశ వ్యాప్తంగా ఆదరణ అందుకుని అందరి దృష్టిలో పడింది.

పుష్ప మూవీలో హైలైట్‌ అయ్యే పాట

పుష్ప మూవీలో హైలైట్‌ అయ్యే పాట

'పుష్ప' మూవీలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ఆరంభం నుంచీ చెబుతూనే ఉంది. సినిమాకే హైలైట్ అవబోయే ఈ సాంగ్‌లో నర్తించేందుకు బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే దిశా పటానీ, ఊర్వశీ రౌటేలా సహా ఎంతో మంది హీరోయిన్లు పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Recommended Video

Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
పుష్పలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రచ్చ

పుష్పలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రచ్చ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్ చేయబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే దీనిపై ఆమె సంతకం కూడా చేసేసిందని అంటున్నారు. గతంలో ఆమె 'బాహుబలి', 'టెంపర్', 'కిక్ 2', 'షేర్', 'లోఫర్', 'ఊపరి' సహా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X