మహేష్ కూతురు సితార ఫాలో అవుతుంది ఎవరినో తెలుసా?.. తన నాన్నని కూడా ఫాలో కొట్టకుండా..!
ఇండియన్ సినిమా దగ్గర హీరోస్ ని ఆరాధ్య దైవంగా కొలిచే ప్రేక్షకులు ఎక్కడైనా ఉంటారు అంటే అది మన తెలుగు సినిమాలోనే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. తెలుగు సినిమా మొదలైన ఇన్నేళ్ళలో గడిచిన అన్ని తారలలో హీరోలు భారీ ప్రజాదరణ పొందినవారు ఉన్నారు. కాగా ఇదే హీరోస్ నుంచి వారి వారసులకు కూడా చాలా చాలా వరకు అదే అభిమానులు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
దీనితో సెలెబ్రెటీ పిల్లలు అంటే కొంచెం ప్రత్యేకత ఉంటుంది. ఇలా మన తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం ఉన్న టాప్ మోస్ట్ హీరోస్ లో ఇంకొన్ని ఏళ్లలో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే వయసుకు వచ్చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోకి చెందిన వారసురాలు కోసమే ఇపుడు సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ గా మారింది. తెలుగులో అశేష ఆదరణ ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.

మరి మహేష్ కి నమ్రత సతీమణి కాగా ఆమె కూడా ఒకప్పుడు సినిమాలు చేసింది కానీ ఇప్పుడు కేవలం తమ కుటుంబాన్ని చూసుకుంటుంది. అయితే మహేష్ కి ఇద్దరు సంతానం, గౌతమ్ ఘట్టమనేని అలాగే సితార ఘట్టమనేని. ఈ ఇద్దరు కూడా మహేష్ అందానికి ఒక ట్రేడ్ మార్క్ లా కనిపిస్తారు. అయితే సోషల్ మీడియాలో సితార చాలా యాక్టీవ్ గానే కనిపిస్తుంది.
ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లోనే ఇంటరాక్ట్ అయ్యే సితార లేటెస్ట్ గా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవ్వడం ఆసక్తిగా మారింది. నున్న రమేష్ అనే అతన్ని ఇన్స్టాలో ఫేమస్ రామ్ అని ఉంటుంది. ఇతడు ఏదో సినిమాల్లో ట్రై చేస్తున్నట్టుగా కొన్ని రీల్స్ నటించి పెడుతూ ఉంటాడు. ఇతనికి 4 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే 2 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న సితార ఈ రీల్స్ స్టార్ ని ఫాలో కొట్టింది.

దీనితో ఇది స్క్రీన్స్ షాట్స్ తీసి షేర్ అవుతూ వైరల్ గా మారింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సితార వయసులో చిన్నదే కానీ సోషల్ మీడియాలో కనీసం తన తల్లిదండ్రులని ఫ్రెండ్స్ ని కూడా ఇప్పటికొచ్చి ఫాలో చెయ్యలేదు. తన ఫాలోయింగ్ లిస్ట్ లో జీరోనే కనిపించేది. కానీ సడెన్ గా ఆ సున్నా ఒకటిగా మారడం చూసి ఎవరిని ఫాలో అవుతుండగా అని ఫ్యాన్స్ చూస్తే రీల్స్ హిందీ రీల్స్ స్టార్ కనిపించాడు.

అయితే ఇది వైరల్ అయ్యేలోపే కొందరు స్క్రీన్స్ షాట్స్ కూడా తీసేసారు కానీ తర్వాత మళ్ళీ సితార అతన్ని అన్ ఫాలో చేసింది. దీనితో ఇలా సితార అంశం ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సితార మహేష్ సినిమాలకి ప్రమోషన్స్ చేయడమే కాకుండా పలు యాడ్స్ ని కూడా ఆమె ప్రస్తుతం చేస్తుంది. అలాగే వీటితో పాటుగా తన స్టడీస్ కూడా కొనసాగిస్తుంది.


Click it and Unblock the Notifications











