ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: అల్లు అర్జున్ సినిమాలో విలన్ నవదీప్ కాదు.. ఈ సీనియర్ నటుడే.!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. రెండు సూపర్ హిట్‌ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమే 'అల.. వైకుంఠపురములో'. వీరిద్దరి కలయికలో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పైనా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే..

వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసేదిగా ఉంటుందన్న టాక్ ఉంది. దీనికి కారణం ఆయన సినిమాల్లో బలమైన ఎమోషన్, అదిరిపోయే పంచ్ డైలాగులు ఉండడమే. గతంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఇది కనిపించింది. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ‘అల.. వైకుంఠపురములో' కూడా తెరకెక్కుతుందని సమాచారం.

రికార్డులు బద్దలు అయిపోతున్నాయి
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి హైప్ కంటిన్యూ అవుతోంది. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ‘సామజవరగమన' అంటూ సాగే పాట సౌత్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, ‘రాములో రాములా'కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది.

విలన్‌గా యంగ్ హీరో.. అందుకే అలా
ఈ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో నవదీప్ కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే. ఇందులో విలన్‌గా నటించడం కోసమే అతడు సిక్స్ ప్యాక్‌తో దర్శనమిస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో బన్నీ.. నవదీప్ మధ్య పోరు భీకరంగా ఉండబోతుందని అంతా అనుకున్నారు.

ఎన్టీఆర్ సినిమా ఆధారంగా
‘అల.. వైకుంఠపురములో' ఎన్టీఆర్ సినిమాకు రీమేక్ అంటూ ఇటీవల ఓ వార్త బయటికొచ్చిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు - సావిత్రి కాంబినేషన్‌లో వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన చిత్రం ‘ఇంటి గుట్టు'. 1958లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని ఆధారంగానే బన్నీ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు.
Recommended Video

విలన్ ఆ సీనియర్ నటుడే
‘అల.. వైకుంఠపురములో' గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇందులో అందరూ అనుకున్నట్లు విలన్ నవదీప్ కాదట. సీనియర్ నటుడు మురళీ శర్మనే అసలు ప్రతి నాయకుడు అని తెలిసింది. అందరూ అనుకున్నట్లు బన్నీ.. మురళీ శర్మ కొడుకు కాదట. తన అసలు కొడుకు (నవదీప్)ను ఉన్నతమైన కుటుంబంలోకి పంపేందుకు ఆయన కుటిలమైన రాజకీయాలు చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











