అక్టోబర్ 15 కాదు.. మళ్ళీ సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే..

కరోనా దెబ్బకు చరిత్రలో ఎప్పుడు లేని విదంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలకు గట్టి దెబ్బె పడింది. ఇక ఇండియాలో కూడా వందల కోట్ల బిజినెస్ ఆగిపోయింది. అయితే థియేటర్స్ ను ఈ నెల 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన విషయం తెలిసిందే. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 50% సీట్లకు మాత్రమే టికెట్లను కేటాయించాలని కొన్ని కచ్చితమైన రూల్స్ ని కూడా పాటించాలని చెప్పడంతో సినిమా థియేటర్స్ ఓనర్స్ లో ఒక కొత్త ఆందోళన మొదలైంది.

సాదారణ రోజుల్లోనే థియేటర్స్ 80% నిండితే గాని లాభాల్లోకి రాని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు 50% అంటే సినిమా థియేటర్లను ఓపెన్ చేయడం కన్నా మరికొన్నాళ్లు క్లోజ్ చేయడమే బెటర్ అంటున్నారు కొందరు. ఇక అక్టోబర్ 15 నుంచి కాకుండా దీపావళి నుంచి రెగ్యులర్ గా ఓపెన్ చేసుకొని 100% సీట్లకు టికెట్స్ విక్రయించేలా అనుమతులు అందుకోవాలని కొందరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, జిల్లా చలన చిత్ర పంపిణీదారుల సంఘాలు దీపావళికె థియేటర్స్ ను ఓపెన్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

Not October 15 but cinemas to re-open from Diwali in this district

ఇక థియేటర్స్ ఓనర్స్ ఇప్పటికే థియేటర్స్ మూసివేయబడిన నెలలకు విద్యుత్ చార్జీల మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇన్నాళ్ళు నష్టాలు ఎదుర్కోన్నందుకు పలు రాయితీలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన కొన్ని సినిమాలను మళ్ళీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాని V సినిమాతో పాటు అనుష్క నిశ్శబ్దం కూడా మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X