OG Movie: పవన్ కళ్యాణ్ కంటే ముందుగా.. ఆ హీరోకి ఓజి కథ చెప్పిన సుజిత్!

తెలుగు సినిమా దగ్గర అపారమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి ఎంత మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ సినిమా వస్తుంది అంటే అది టాక్ తో సంబంధం లేకుండా డే 1 బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది.

కాగా దర్శకుడు ఎవరో కూడా తెలియని సినిమాలు చేస్తూ వచ్చిన పవన్ అలాంటి సినిమాలతో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించగలిగే సత్తా ఉన్నవాడు అని ఎవరో అన్న మాట కాదు తెలుగు సినిమా దగ్గర ఎన్నో సినిమాలు నిర్మాణం వహించి డిస్ట్రిబ్యూషన్ అందించిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్ బాబు అన్న మాట ఇది.

not pawan kalyan varun tej heard they call him og first from sujeeth

దీనితో పాటుగా చిన్న దర్శకులతోనే పవన్ రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తారు అలాంటిది ఒక స్టార్ దర్శకుడితో వస్తే దాని ఇంపాక్ట్ ఊహించని లెవెల్లో ఉంటుంది అని కూడా కితాబిచ్చారు. అలాగే పవన్ తన ప్రైమ్ టైం ని రీమేక్స్ చేస్తూ మార్కెట్ ని తగ్గించుకుంటున్నాడు అని అభిమానుల్లో కూడా ఒకింత అసహనం ఉంది. చేస్తే డైరెక్ట్ సినిమాలు చేయాలని వారు ఎప్పుడు నుంచో కోరుకుంటున్నారు.

మరి అలా పవన్ ఎన్నో ఏళ్ళు తర్వాత చేస్తున్న డైరెక్ట్ సినిమాలు ఇప్పుడు రెండు ఉన్నాయి. కాగా వీటిలో దర్శకుడు క్రిష్ తో భారీ సినిమా "హరిహర వీరమల్లు" స్టార్ట్ అయ్యింది. దీనిపై అప్పట్లో ఎన్నో అంచనాలు సెట్టయ్యాయి కానీ దీనిని తలదన్నే సినిమాని యువ దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ దగ్గరకి తెచ్చాడు. మరి ఆ సినిమానే "ఓజి" ఇప్పుడు వరకు పవన్ చేసిన అన్ని సినిమాల్లో దీనిపైనే ఎనలేని హైప్ ఉంది.

సినిమా కాన్సెప్ట్ గాని పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని గ్లింప్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అంశం బయటకి వచ్చింది. కాగా ఈ సినిమా కథ పవన్ కంటే ముందే మరో హీరో వినేసాడట. ఆ హీరో ఎవరో కూడా కాదు మెగా యువ హీరో వరుణ్ తేజ్ నే..

మరి వరుణ్ తేజ్ నేను కళ్యాణ్ బాబాయ్ కంటే ముందే ఈ కథ వినేసాను అని ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూసినా అది అందుకు వర్త్ గా నిలుస్తుంది అని అసలు ఓజి ఊహలకి అందని రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పేసాడు. దీనితో ఓజి పై ఇపుడు మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఇక్కడ పవన్ కంటే ముందు ఓజి స్టోరీని వరుణ్ తేజ్ వినడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇది బహుశా కథ పవన్ కోసం ప్రిపేర్ అయినప్పటికీ మొదటిగా వరుణ్ తేజ్ నార్మల్ గా విని ఉండొచ్చు. మరి ఎవరికి ముందు చెప్పినప్పటికీ ఓజి విషయంలో పవన్ ఫాక్టర్ తో అంచనాలు ఇపుడు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X