"వకీల్ సాబ్" కి ఫస్ట్ ఛాయిస్ వేణు కాదా? పవన్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ డైరెక్టర్
ఇప్పుడు తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లోకి ఎంత మంది హీరోలు వెళ్లినప్పటికీ మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆ హీరో తాలూకా స్టామినా ఎంత అనేది మొదట చెప్పుకోవాలి. మరి అలాంటి మాట వస్తే డెఫినెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటే ముందు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ గాని వాటితో వచ్చే ఓపెనింగ్స్ కానీ ఊహించని లెవెల్లో వస్తాయి.
అలా పవన్ ఇపుడు రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలు మీదనే కానీ దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి తన లెవెల్ ఇంకోలా ఉండేది అని చాలా మంది భావిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన కొన్ని సినిమాలు ఎంతో ఫాస్ట్‌గా ఫినిష్ చేశారు. మరి కొన్ని సినిమాలు మాత్రం అంతే ఆలస్యంగా పూర్తి చేస్తారని చెప్పాలి.

రాజకీయాల్లో బిజీ అయిన దశలో పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మళ్ళీ తన ఆర్ధిక పరిస్థితులు రీత్యా ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అలా తాను చేసిన సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రమే "వకీల్ సాబ్". మరి అప్పట్లో ఈ సినిమా అందుకున్న హైప్ అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అందుకుందంటే పవన్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
కానీ మంచి సమయంలో కానీ విడుదల అయ్యి ఉంటే వకీల్ సాబ్ సినిమా డెఫినెట్‌గా అప్పట్లోనే 100 కోట్ల షేర్ దాటేసి ఉండేది. అయితే ఈ సినిమాని దర్శకుడు వేణు శ్రీరామ్ (నానితో ఎంసిఏ చేసిన దర్శకుడు) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ని చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ రోల్ లో తాను ప్రెజెంట్ చేశారు. పైగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రెజెంట్ చేయడంతో వేణు శ్రీరామ్ ని పవన్ అభిమానులు అప్పుడు మాస్ గాడ్ అంటూ కూడా పిలుచుకున్నారు.

మరి అలాంటి సినిమా ఇచ్చిన వేణు శ్రీరామ్ ఈ వకీల్ సాబ్ సినిమాకి మొదటి ఛాయిస్ కాదని మీకు తెలుసా? అవును మొదటగా అయితే ఈ సినిమా కోసం అసలు వేణు శ్రీరామ్ లిస్ట్ లో లేడట. ముందు ఆ సినిమాని నిర్మాత దిల్ రాజు దర్శకుడు హరీష్ శంకర్ తో చేయించాలని అనుకున్నారట. అప్పటికే పవన్ తో హరీష్ శంకర్ కి గబ్బర్ సింగ్ అనే సెన్సేషనల్ హిట్ ఉంది. పైగా పవన్‌కు హరీష్ వీరాభిమాని.
దీంతో దిల్ రాజు హరీష్‌తోనే ఈ సినిమా టేకప్ చేద్దాం అనుకున్నారట. కానీ దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం వేణుతో చేయాలని సూచిస్తే అలా వేణు శ్రీరామ్ .. వకీల్ సాబ్ ప్రాజెక్ట్ లోకి రావడం జరిగింది. సో ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు పవన్ కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రో కార్డుని వేణు డిజైన్ చేయించి అదరగొట్టాడు. కానీ కోవిడ్ పరిస్థితులు లేకపోతే వకీల్ సాబ్ సినిమా ఇంకా బాగా రన్ అయ్యిదని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. సో అదన్న మాట మేటర్.


Click it and Unblock the Notifications











