twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీకల్లోతు ప్రేమలో డైరెక్టర్.. ప్రియురాలిని ముద్దుల్లో ముంచెత్తుతూ..

    |

    Recommended Video

    NOTA Director Anand Shankar Shares Personal Photos | Filmibeat Telugu

    తమిళ దర్శకుడు ఆనంద శంకర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ప్రియురాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెతో కలిసి దుబాయ్‌లో తేలాడు. చెట్టాపట్టాలేసుకొని ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించిన నేపథ్యంలో ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. వివరాల్లోకి వెళితే..

    అపుడు నావద్ద డబ్బుల్లేవు, చైతన్య మస్తు చిల్: విజయ్ దేవరకొండఅపుడు నావద్ద డబ్బుల్లేవు, చైతన్య మస్తు చిల్: విజయ్ దేవరకొండ

    నోటాతో టాలీవుడ్‌కు

    నోటాతో టాలీవుడ్‌కు

    తమిళ రీమేక్ ఇరుమురుగన్ (తెలుగులో ఇంకొకడు) దర్శకుడు ఆనంద శంకర్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవల వచ్చిన నోటా మూవీతో మరింత చేరువయ్యాడు. మీడియాలో ఫ్రొఫెషనల్ జీవితం తప్పా మరోటి పంచుకొని ఈ డైరెక్టర్ వ్యక్తిగత జీవితాన్ని తాజాగా సోషల్ మీడియాలోకి తీసుకొచ్చాడు.

    లవ్ ప్రపొజ్ చేశాను

    లవ్ ప్రపొజ్ చేశాను

    నా ప్రియురాలితో లవ్ ప్రపోజ్ చేశాను. అందుకు ఆమె ఒకే చెప్పింది. అందుకే నా ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని అనుకొన్నాను. అందుకే నా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఆనంద్ శంకర్ వెల్లడించారు.

    ప్రైవేట్ లైఫ్ గురించి

    నా ప్రైవేట్ లైఫ్ గురించిన తొలి పోస్ట్ ఇది. నేను ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్‌ను బయటకు చెప్పను. చాలా సిగ్గుపడే మనస్తత్వం కలవాడిని. కానీ ఈ పరిస్థితుల్లో నా సంతోషాన్ని పంచుకోలేక ఉండలేకపోతున్నాను. నా ప్రేమకు మీ ఆశీర్వచనాలు కావాలి అని ఆనంద్ శంకర్ ట్వీట్ చేశాడు.

     విలాసవంతమైన కారులో

    విలాసవంతమైన కారులో

    ప్రస్తుతం ప్రియురాలితో కలిసి ఆనంద్ శంకర్ దుబాయ్‌లో విహార యాత్ర చేస్తున్నారు. విలాసవంతమైన కారులో తిరుగుతూ.. ముద్దులు పెట్టుకొంటున్న ఫొటోలను షేర్ చేశారు. కేక్ కట్ చేసి తమ ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఆనంద్ శంకర్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఆకట్టుకొని నోటా చిత్రం

    ఆకట్టుకొని నోటా చిత్రం

    తమిళంలో అరిమా నంబి అనే చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు. ఆ తర్వాత విక్రమ్‌తో ఇరు మురుగన్ సినిమా రూపొందించి సక్సెస్ మూటగట్టుకొన్నారు. తాజాగా విజయ్ దేవరకొండతో రూపొందించిన నోటా సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

    English summary
    NOTA director Anand Shankar opened up about his personal life and tweeted about his girlfriend who is based out in Dubai. On the occasion of Diwali, the director shared the news on the social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X