'ఏ' సర్టిఫికేట్ సినిమా అనుకున్నా.. నోటా సెన్సార్‌పై విజయ్ దేవరకొండ!
ఇటీవలే గీత గోవిందం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నెలల వ్యవధిలోనే మరో చిత్రంతో రాబోతున్నాడు. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ నోటా అక్టోబర్ 5 న విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆక్తికరమైన పొలిటికల్ కథాంశంతో ఈ చిత్రం రాబోతోంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.

తాజగా ఈ చిత్ర తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమిళ వర్షన్ కు యూ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం. దీనిపై విజయ్ దేవరకొండ సరదాగా స్పందించాడు. నోటా చిత్రానికి సెన్సార్ వాళ్ళు 'ఏ' సర్టిఫికేట్ ఇస్తారనుకున్నా. కానీ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. మన తెలుగు సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు.
తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన నోటాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











