twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నోటా’ ట్రైలర్: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం, ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ కేక...

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘నోటా’ ట్రైలర్: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం, ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ కేక...!

    విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'నోటా'. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బేనర్లో కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా 'నోటా' ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు ముగ్ధులైపోతున్నారు. ఇప్పటి అతడు వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా తెరరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామాలో..... విజయ్ తన నట విశ్వరూపం చూపించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    పవర్‌పుల్‌గా విజయ్ దేవరకొండ.. మరోసారి విశ్వరూపమా? లిప్‌లాక్ కూడా..పవర్‌పుల్‌గా విజయ్ దేవరకొండ.. మరోసారి విశ్వరూపమా? లిప్‌లాక్ కూడా..

    ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ

    ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. అనుకోకుండా సీఎం పీఠం ఎక్కిన విజయ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? రాజకీయ చదరంగంలో అతడు పావుగా మారాడా? లేక అందరినీ ఆటాడించాడా? అనే ఆసక్తి ఈ ట్రైలర్ ద్వారా అందరిలో పెరిగేలా చేశారు.

    పొలిటికల్ దందా

    పొలిటికల్ దందా

    రాజకీయ నాయకులు, స్వామీజీల ప్రస్తావన తేవడంతో పాటు వారి స్వార్థం, అధికార, ధన దాహం కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతారు అనేది ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.

    జర్నలిస్టుగా మెహ్రీన్

    జర్నలిస్టుగా మెహ్రీన్

    ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్టుగా కనిపించబోతోంది. జర్నలిస్టుగా సీఎం విజయ్‌ దేవరకొండను ‘డమ్మీ సీఎం మరీ ఇంత డమ్మీనా? ఇది ముఖ్యమంత్రి పదవా? లేక మ్యూజికల్ చైర్స్ ఆటా?' అంటూ వేసే డైలాగులు సినిమాలో హీరో పాత్ర ఎలాంటిదో ఓ క్లారిటీ వచ్చేలా చేశాయి.

     ఆ ఎక్స్‌ప్రెషన్ ఈ ట్రైలర్‌కే హైలెట్

    ఆ ఎక్స్‌ప్రెషన్ ఈ ట్రైలర్‌కే హైలెట్

    ఇక ఈ ట్రైలర్లోని ఓ సీన్లో... అల్లర్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థలానికి వచ్చిన విజయ్.... అక్కడ రెస్పాండ్ అయ్యే సన్నివేశంలో అతడి ఎక్స్‌ప్రెషన్ హైలెట్ అనేలా ఉంది.

    పక్కా పొలిటికల్ మూవీ

    పక్కా పొలిటికల్ మూవీ

    ఈ గేమ్‌లో నువ్వు చూసే రక్తం నిజం, నీ శత్రువులు నిజం, ఆడటం మొదలు పెట్టావో ఆపడం నీ చేతుల్లో లేదు, లైఫ్ ఆర్ డెత్ అంటూ సాగే డైలాగులు.... సినిమా పొలిటికల్‌గా ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

    మరో సంచలనం ఖాయమేనా?

    మరో సంచలనం ఖాయమేనా?

    ‘నోటా' ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ కెరీర్లో మరో సంచలనం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 4న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    NOTA OFFICIAL TRAILER released. Nota is an upcoming Telugu - Tamil bilingual Political Thriller film directed by Anand Shankar. It stars Vijay Deverakonda and Mehreen Pirzada in the lead roles. It is directed by Anand Shankar and Produced by Studio Green banner while Sam C.S. scored music for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X