అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తున్న ఓటీటీ సంస్థ.. పుష్ప 2 పై అలాంటి ట్రోలింగ్
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్స్ లో కొత్త పేరుగా పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు అని చెప్పవచ్చు. ఎలాంటి రాజమౌళి బ్రాండింగ్ లేకుండా ఐకాన్గాము స్టార్ అల్లు అర్జున్ సొంతంగా తన ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్లో సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన లేటెస్ట్ చిత్రం పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర తిరగరాశాడు కూడా..
అయినప్పటికీ అల్లు అర్జున్ పై కొన్ని అంశాల్లో ట్రోల్స్ లేకపోలేవు. ఇలా అల్లు అర్జున్ తన సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా సోషల్ మీడియాలో ఏదొక విషయంలో హైలైట్ అవుతూ వస్తున్నాడు. కాగా పుష్ప 2 ఓటిటిలో విడుదల అయ్యాక కూడా పలు కామెంట్స్ ఈ చిత్రం విషయంలో వచ్చాయి.

మెయిన్ గా క్లైమాక్స్ లో ఫైట్ పై గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. ఇక పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రపంచ పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం అభిమానులు కంటే వెస్ట్రన్ ఆడియెన్స్ కూడా చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇక ఇదిలా ఉండగా పుష్ప 2 ఓటిటి హక్కులు కోసం ఆ మధ్య యుద్ధమే జరిగింది.
కాగా పార్ట్ 1 ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంటే పార్ట్ 2 ని మాత్రం తమ ప్రధాన పోటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చి కొనేసింది. మరి లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఓ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ వి రెండు ఫోటోలు పెట్టి అల్లు అర్జున్ ఒకప్పుడు ఫ్లవర్ ఇపుడు ఫైర్ అంటూ పొగుడుతూనే తిట్టినట్టుగా పోస్ట్ చేశారు.
దీనితో ఈ పోస్ట్ చూసిన యాంటి ఫ్యాన్స్ ఆఖరికి ప్రైమ్ వీడియో వారు కూడా ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అల్లు అర్జున్ అప్పట్లో కూడా హిట్స్ కొట్టాడు అయినా కూడా అల్లు అర్జున్ జర్నీ అప్పుడు ఫ్లవర్ లా ఉంది ఇపుడు ఫైర్ అంటే ఏంటి అర్ధం? మరి పుష్ప 2 హక్కులు వారికి ఇవ్వనందుకు అనుకోవాలా లేక మరో కారణమా అనేది వాళ్ళకే తెలియాలి.
కానీ ఈ పోస్ట్ మాత్రం ఇపుడు వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నెక్స్ట్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలాగే మరో టాలెంటెడ్ యువ దర్శకుడు అట్లీ లతో చేస్తే ఇమీడియేట్ ప్రాజెక్ట్ ఉండనుంది. వీటిలో ఏదో ఒకదాని కోసం మాత్రం ఫ్యాన్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











