Samantha కాంట్రావర్సీలో ఇద్దరూ.. కానీ సమంతకే ఎక్కువ మద్దతా?

రీసెంట్ గా తెలుగు సినిమాకి చెందిన నటీనటుల విషయంలో పలు కాంట్రవర్సీలు ఏ రీతిలో వెలుగులోకి వస్తున్నాయో తెలిసిందే. కాగా చిన్న హీరోస్ నుంచి పెద్ద హీరోస్ వరకు గడిచిన కొన్ని నెలల్లోనే పలు షాకింగ్ వార్తలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. ఇలా యువ హీరో రాజ్ తరుణ్ నుంచి ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య తన మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత వరకు వచ్చాయి.

కాగా మధ్యలో నాగ చైతన్య రెండో పెళ్లి విషయంలో తనకి కాబోయే భార్య ధూళిపాళ, చైతు పేర్లు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. కానీ అదే సమయంలో సమంత ఆమె ఎలాంటి స్పందన చూపకపోయినప్పటికీ ఆమె పేరుని చాలా మంది తీసుకొచ్చారు. సరే ఇదంతా అయ్యిపోయింది అనుకుంటే ఇప్పుడు ఊహించని విధంగా సమంత, నాగ చైతన్య పేర్లని తెలంగాణ రాజకీయాల్లో ముడిపెట్టి అక్కడి కాంగ్రెస్ మహిళా మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి.

noth samantha and naga chaitanya in latest controversy but most of support for sam only

నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని అతని వల్లే వారు విడిపోయారు అని కేటీఆర్ అడిగింది చేయకపోవడం వల్లే అంటూ పలు ఊహించని, జీర్ణించుకోలేని ఆరోపణలు ఆమె చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ నాగ చైతన్య, సమంతల పేర్లు కాంట్రవర్సీలో వైరల్ గా మారాయి. దీనిపై వెంటనే నాగార్జున స్పందించడం ఆ తర్వాత నాగ చైతన్య, సమంత కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వంటివి సంచలనంగా మారాయి.

కాగా ఇద్దరూ కాంట్రవర్సీలో ఇరుక్కున్నప్పటికీ ఇద్దరిలో మాత్రం ఎక్కువ సింపతీ సమంత వైపే కనిపిస్తుంది. కాగా ఈ మేటర్ సినీ వర్గాల్లో కూడా చాలా మంది ప్రముఖులు దీనిపై రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి విషయంలో అయితే సమంత సైడ్ మాత్రమే కనిపిస్తున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వరకు ఎక్కువగా సమంత వైపు స్టాండ్ తీసుకుంటున్నారు.

noth samantha and naga chaitanya in latest controversy but most of support for sam only

ఇలాంటి విషయాల్లో ఒక ఆడపిల్ల జీవితాన్ని లాగడం కరెక్ట్ కాదని బన్నీ సహా ఎన్టీఆర్ సైతం అంటున్నారు. అలాగే దసరా దర్శకుడు అయితే సమంతని "రంగస్థలం" సినిమాకి తాను అసిస్టెంట్ దర్శకునిగా చేస్తున్నపుడు నుంచి చూస్తున్నాను అని తాను నాకు ఒక అక్కలా అనిపిస్తారు చాలా కష్టపడతారు. అలాంటిది సమంత పై దారుణమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని శ్రీకాంత్ ఓదెల బాధను వ్యక్తం చేసాడు.

అలాగే వీరు సహా చాలా మంది సినీ ప్రముఖులు సమంతకు ఎక్కువ మద్దతుగా నిలుస్తున్నారు. సో నాగ చైతన్య, సమంతల గొడవలో మరోసారి సమంత వైపు ఎక్కువమంది అది కూడా సినీ పరిశ్రమ నుంచి నిలబడడం అనేది ఆమెకి మరింత ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. కాగా ప్రస్తుతం సమంత తన వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉండగా నాగ చైతన్య తన భారీ చిత్రం "తండేల్" సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలో లేదా వచ్చే ఏడాది రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X