twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరాటే కళ్యాణి ఫిర్యాదు.. ముందుకు కదిలిన కేసు.. శ్రీరెడ్డికి నోటీసులు

    |

    కరాటే కళ్యాణి, శ్రీ రెడ్డి, రాకేష్ మాష్టర్ వ్యవహారం... ఒకరిపై ఒకరు దూషించుకోవడం, సవాళ్లు విసురుకోవడం, కేసులు పెట్టుకోవడం లాంటివి అందరికీ తెలిసిందే. వీరికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీరు పెట్టిన కేసుల్లో కదలికలు వచ్చినట్టు తెలుస్తోంది.

    రాకేష్ మాష్టర్‌తో మొదలు..

    రాకేష్ మాష్టర్‌తో మొదలు..

    రాకేష్ మాస్టర్ ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ శ్రీ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. గతాన్ని మళ్లీ తవ్వి తీశాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని చూపెట్టింది. పరుషమైన పదజాలంతో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలను అనరాని మాటలు అంది. దీంతో మళ్లీ గొడవ మొదటికి వచ్చింది.

    లైవ్‌లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి

    లైవ్‌లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి

    కరాటే కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ, కించపరిచేలా ఫేస్‌బుక్ లైవ్‌లో రెచ్చిపోయింది. అది చూసిన కరాటే కళ్యాణి వీడియోతో పాటు దానికి సంబంధించిన యూఆర్‌ఎల్‌ను పొందుపరుస్తూ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

     శ్రీ రెడ్డి సైతం ఫిర్యాదు..

    శ్రీ రెడ్డి సైతం ఫిర్యాదు..

    పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను పట్టించుకోను, నన్ను అరెస్ట్‌ చేసినా సరే అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. చెన్నైలోనూ శ్రీ రెడ్డి కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లపై ఫిర్యాదు చేసింది. అయితే ఇలా ఇరువురు ఇచ్చిన వాటిల్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు కాస్త ముందుకు సాగింది.

    Recommended Video

    Actress Sri Reddy Sensational Comments On Director Teja
    శ్రీరెడ్డికి నోటీసులు..

    శ్రీరెడ్డికి నోటీసులు..

    కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో నిందితురాలిగా పరిగణిస్తూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని తీసుకుని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకు అందించినట్టు తెలుస్తోంది.

    English summary
    Notice To Sri Reddy According To Karate Kalyani Files Case Against Her. After Srireddy Abuse Karate Kalyani In Social Media, She Filed A Case In Cyber Crime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X