November Releases: సినీ ప్రియులకు పండగే పండగ.. నవంబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!

దసరా పండుగకు ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిని చూసిన సినీ ప్రేక్షకులు మరికొన్ని కొత్త సినిమాలు కోసం ఇప్పటికే వేచి చూస్తున్నారు. థియేటర్ల వద్ద ఫుల్ థ్రిల్ నిచ్చే చిత్రాల కోసం తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే అలాంటి వారి కోసమే అన్నట్లుగా ఈ వారం సరికొత్త చిత్రాలు వస్తున్నాయి.

కడుపబ్బా నవ్వించడంతో పాటు తీవ్రంగా భయపెట్టేందుకు అద్భుతమైన కొత్త చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ వారం ముఖ్యంగా శుక్రవారం ఒక్క రోజే నాలుగు సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 November First Friday These Comdedy And Horros Movies Will be Released on Theatres

నంవబర్ 3న కీడా కోలా: దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో రాబోతున్న తాజా చిత్రం కీడా కోలా. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, చైతన్య రావు, తరుణ్ భాస్కర్, రాగ్ మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. ఫుల్ కామెడీతో అందరినీ నవ్వించేందుకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. నవంబర్ నెల మొదటి శుక్రవారం ఈ చిత్రం రాబోతుండగా.. చాలా మంది ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 November First Friday These Comdedy And Horros Movies Will be Released on Theatres

నవంబర్ మూడున పొలిమేర 2: అలాగే గతంలో ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన పొలిమేర చిత్రం ఎంత పెద్ద హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా పొలిమేర 2 రాబోతుంది. సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో రాబోతున్న ఈ చిత్రం కూడా నవంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పార్ట్ 1 కంటే కూడా అత్యధిక థ్రిల్ ను ఇచ్చేలా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలోని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.

 November First Friday These Comdedy And Horros Movies Will be Released on Theatres

శుక్రవారం రోజున "విధి" విడుదల: శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వంలో రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్లుగా రాబోతున్న తాజా చిత్రం విధి. నో ఐడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్ నిర్మించిన ఈ సినిమాకు కూడా నవంబర్ మూడో తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే హ్యాపీగా ఉండే ఓ జంట మఘ్య విధి ఎలాంటి సమస్యలు సృష్టించింది, ఎలాంటి మలుపులు చేసుకున్నాయే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో.

మనోజ్ కుమార్ అనే ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన 12 ఫెయిల్ చిత్రంలో విక్రాంత్ మస్సే హీరోగా నటించారు. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కూడా నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ అబ్బాయి.. పట్టుదలతో ఐపీఎస్ అధికారి అవుతాడు. అయితే అతడి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఎలాంటి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు లాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తుండగా.. శుక్రవారం రోజు తెలుగులో థియేటర్లలో సందడి చేయబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X