నెట్‌ఫ్లిక్‌లో వెబ్ సిరీస్‌కు ‘ప్రపంచ’ పాపులారిటి.. అందులోని యాక్టర్‌‌కు ఆ విషయమే తెలియదట!

నెట్ ఫ్లిక్స్‌లో మనీ హీస్ట్ వెబ్ సిరీస్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉంది. అయితే నాలుగో సీజన్‌లో నటించేంత వరకు ఆ సిరీస్ ఒకటి ఉంటుందనే విషయం తనకు తెలియదని అందులో నటించిన అజయ్ జేతి అన్నారు. కానీ అత్యంత పాపులారిటీ కలిగిన వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించడం సంతోషంగా ఉందని చెప్పారు. అయితే తాను నటించిన మనీ హీస్ట్ పాపులారిటీ గురించి కూడా తనకు తెలియదని, తన మేనేజర్ చెప్పిన తర్వాత ఓ రకమైన షాక్ గురయ్యానని అజయ్ తెలిపారు. తాను నటించిన వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇంత పాపులారిటీ ఉందా అని ఆశ్చర్యపోయారట. ఆ వెబ్ సిరీస్ గురించి వివరాల్లోకి వెళితే..

అనూహ్యమైన పాపులారిటీ

అనూహ్యమైన పాపులారిటీ

మనీ హీస్ట్‌కు అనూహ్యమైన పాపులారిటీ వచ్చిన విషయం తెలుసుకొని మీడియాతో అజయ్ మాట్లాడుతూ.. నాకు టెలివిజన్ గానీ, నెట్ ఫ్లిక్స్ అకౌంట్ గానీ లేదు. వర్క్ పర్మిట్ వీసాపై 2005లో స్పెయిన్‌కు వచ్చాను. అప్పుడు ఏడాదిపాటు కన్‌స్ట్రక్షన్ లేబర్‌గా పనిచేశాను. ఆ తర్వాత డబ్బుల కోసం ఫ్యాక్టరీలో పనిచేశాను. అప్పుడు స్పానిష్, యాక్టింగ్ కోర్సులు నేర్చుకొన్నాను అని చెప్పారు.

అందుకే పెద్దగా పట్టించుకోలేదు.

అందుకే పెద్దగా పట్టించుకోలేదు.

మనీ హీస్ట్ పాపులారిటీ తెలియకపోవడంపై స్పందిస్తూ.. కెరీర్ ఆరంభంలో ఏదో అవకాశంతో నటిస్తాం. ఆ మూవీ గానీ, వెబ్ సిరీస్ పూర్తయిందా అనే విషయం పెద్దగా పట్టించుకొనే అవకాశం కూడా ఉండదు. అందులో నాది చిన్న పాత్ర. అందుకే దాని గురించి పట్టించుకోలేదు. అది ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అయిందనే విషయం యూనిట్ చెప్పదు.. మాకు తెలుసుకొనే ఛాన్స్ ఉండదు. అందులో నా చిన్న పాత్ర. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అజయ్ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

మనీ హీస్ట్‌లో షకీర్ అనే పాకిస్థాన్ హ్యాకర్‌గా నటించాను. ఆ పాత్ర గురించి ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, కెనడా నుంచి చాలా మంది మెసేజ్ పంపారు. దాంతో చాలా ఎమోషనల్ అయ్యాను. నేను పంజాబీని కావడం, ఆ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. పాకిస్థాన్ నుంచి కూడా మంచి స్పందన లభించింది అని అజయ్ చెప్పారు.

Recommended Video

RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే

బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే

ఇక బాలీవుడ్‌లో ఈ వెబ్ సిరీస్‌ను రీమేక్ చేస్తే అందులో ఆయుష్మాన్ ఖురానా, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వారైతే బాగుంటుంది. వారిద్దరు నాకు ఆదర్శం. వారిద్దరూ ప్రతిభావంతులైన నటులు. మనీ హీస్ట్‌లోని ప్రొఫెసర్ పాత్ర గురించి ఆలోచించినప్పుడు ఆ ఇద్దరు నటులే గుర్తుకు వస్తారు. ఆయన భార్య పాత్రకు విద్యాబాలన్ అయితే బాగుంటుంది అని తాను భావిస్తాను అని అజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అజయ్ జేతి బార్సిలోనాలో స్థిరపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X