ప్రేమను కొత్త కోణంతో.. ఎన్నారైలంతా సంశయం
ప్రేమించడానికి, ప్రేమించానని చెప్పడానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలతో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం సంశయం. మహేష్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్లో మహేష్ చెంగారెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్నారు.
షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో మోషన్ పోస్టర్ను విడుదల చేయడానికి యూనిట్ సిద్దమవుతుంది. కాలిపోర్నియాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో నటీనటులంతా NRIలు కావడం విశేషం.

చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. 'ప్రేమ'అనేది సినిమా కధకు పురాతనమైనదైనా, ప్రేమికులకు మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలాంటి ప్రేమను కొత్త కోణంలో కాకుండా, కొత్త జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో మా ఈ 'సంశయం'లో చూపించబోతున్నాం. చిత్రానికి ఈ టైటిల్నే ఎందుకు పెట్టామన్నది. సినిమా చూస్తేనే తెలుస్తుందన్నారు. ఇంకా నటీనటులంతా కొత్తవాళ్ళే అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా చేశారు.
ఈ చిత్రంలో కధానాయకుడిగా అనిరుధ్ కస్తూరి, కథానాయకిగా దివ్య నటించారు. సినిమాటోగ్రాఫర్: సర్ హెన్రీ చాంగ్, ఎడిటర్: సన్నీ అట్లూరి, సంగీతం: కళ్యాణ్ కదిన్, ప్రమోద్ పులిగిల్ల, PVRరాజా, PRO: మధు విఆర్, రచన-దర్శకత్వం: మహేష్ చెంగారెడ్డి


Click it and Unblock the Notifications











